'డ్యూడ్'పై కేసు.. ఇళయరాజాకు కోర్టు అనుమతి

Published on Wed, 10/22/2025 - 15:47

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) డ్యూడ్ సినిమా యూనిట్‌పై దావా వేశారు. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Raganathan) హీరోగా నటించిన  ఈ మూవీ  దీపావళి  పండుగ సందర్భంగా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన డ్యూడ్‌ చిత్రాన్ని దర్శకుడు కీర్తిశ్వరన్ తరెకెక్కించారు. ‌అయితే, డ్యూడ్‌ సినిమాలో  ఇళయరాజా సంగీతం అందించిన 'పుదు నెల్లు పుధు నాతు' చిత్రంలోని 'కరుతమచ్చన్'(Karutha Machan song) పాటను ఉపయోగించారు. మూవీలో ప్రదీప్‌ రంగనాథన్‌,  మమితా బైజు పెళ్లి సమయంలో ఈ సాంగ్‌ రన్‌ అవుతుంది.

ఏదైనా ఒక పాత సినిమాకు సంబంధించి డైలాగ్స్‌, పాటలు వంటివి రీక్రియేట్‌ చేయాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఈ మధ్య చాలామంది మేకర్స్‌ అనుమతి లేకుండా తీసుకోవడంతోనే ఇలాంటి సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే డ్యూడ్‌ మేకర్స్‌తో పాటు సోనీ మ్యూజిక్‌పై ఇళయరాజా దావా వేశారు.  

గతంలో కూడా అజిత్‌ సినిమా 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' విషయంలో  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై ఇళయరాజా దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, తాము అనుమతి తీసుకున్న తర్వాతే సాంగ్స్‌ను ఉపయోగించుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్‌ అన్నారు. ఇప్పుడు డ్యూడ్‌ సినిమా పరంగా కూడా వారు మరోసారి చిక్కుల్లో పడ్డారు. డ్యూడ్‌ సినిమా విషయంలో దావా వేసేందుకు ఇళయరాజాకు కోర్టు అనుమతి ఇచ్చింది. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)