Breaking News

హిట్‌ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు

Published on Thu, 05/23/2024 - 07:27

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా తాజాగా మరో సినిమా యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు. తను సంగీతం అందించిన పాటును అనుమతిలేకుండా ఉపయోగించుకున్నారని ఆయన నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన పాటలను ఉపయోగించుకున్న పలు సినిమాలకు సంబంధించిన మేకర్స్‌కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాదిలో మలయాళం నుచి విడుదలైన 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్‌ కొట్టింది. తెలుగు,తమిళ్‌లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే 1991లో ఇళయరాజా- కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన గుణ చిత్రంలోని  'కణ్మణి అన్బోడు' పాటను ఈ చిత్రంలో ఉపయోగించారు. అయితే,  తమ అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నందుకు మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు సంగీత స్వరకర్త ఇళయరాజా తరపున న్యాయవాది శరవణన్ నోటీసు పంపారు.

కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందినవని, అలాంటి సమయంలో పాటను ఉపయోగించుకోవడానికి హక్కులు పొందాలంటే.. వినియోగానికి తగిన పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొనబడింది. లేకుంటే కాపీరైట్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. రజనీకాంత్‌ నటిస్తున్న 'కూలి' చిత్రం టైటిల్‌ టీజర్‌లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్‌ పిక్చర్స్‌కు కూడా  ఇళయరాజా నోటీసు పంపారు. 

 

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)