Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
Breaking News
IFFI 2025: ఒక్క మహిళ కూడా కనిపించలేదా?.. నెటిజన్స్ ఫైర్
Published on Wed, 11/12/2025 - 13:13
‘ఇఫీ’ (ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) 56వ ఎడిషన్ ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 దేశాలకు చెందిన 240 చిత్రాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ‘ఇఫీ’(IFFI 2025)లోని ఇండియన్ పనోరమా(Indian Panorama) సెక్షన్ జ్యూరీ చైర్మన్‌గా దర్శక–నిర్మాత–నటుడు రాజ్ బుందేలా నియమితులయ్యారు.
తాజాగా ఈ విభాగానికి సంబంధించిన జ్యూరీ సభ్యులను అధికారికంగా ప్రకటించారు. కృష్ణ హెబ్బాళే, కమలేష్ కె. మిశ్రా, మలయ్ రే, సుభాష్ సెహ్‌గల్, అరుణ్ భక్షి, అసీమ్ సిన్హా, అశోక్ శరణ్, సుకుమార్ జతానియా, బీఎస్ బసవరాజు, అమరేష్ చక్రవర్తి, నెపోలియన్ థంగా, జడుమోని దత్తా జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ ప్యానెల్‌లో మహిళలకు చోటు దక్కకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
‘జ్యూరీలో మహిళలకు చోటు లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది’, ‘ఉమెన్ జ్యూరీ అంటూ ప్రత్యేకమైన పోస్ట్ ఏమైనా ఉందా?’ (వ్యంగ్యంగా..), ‘మహిళల కోసం మహిళలు నటించిన సినిమాలను ఎంపిక చేసేందుకు అందరూ మహిళలే ఉండేలా ప్రత్యేకమైన జ్యూరీ ఏదైనా ఉందా?’, ‘జ్యూరీలో భాగం చేయడానికి దేశం మొత్తం మీద మీకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా?’ అంటూ... సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు.
మరోవైపు... లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించడం లేదంటూ కొంకణి దర్శక–రచయిత ఎస్. లక్ష్మీకాంత్ ‘ఇఫీ’ వైఖరిని తప్పుపట్టారు. పలు అవార్డులు, రివార్డులు పొందిన కొంకణి షార్ట్ ఫిల్మ్ ‘ఆన్సెస్సావో’ని ప్రదర్శనకు ఎంపిక చేయకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (తెలుగు), ‘అమరన్’ (తమిళం), ‘తుడరుమ్’ (మలయాళం) ‘సు ఫ్రమ్ సో’ (కన్నడ), గ్రౌండ్ జీరో, తన్వి ది గ్రేట్, ఛావా, ది బెంగాలీ ఫైల్స్ (హిందీ)..’ వంటి చిత్రాలతో ΄ాటు పలు భాషలకు చెందిన దాదాపు ముప్పై చిత్రాలు పోటీ పడుతున్నాయి.
Tags : 1