Breaking News

అదృష్టం కాదు... అంకితభావం ఉండాలి

Published on Sun, 11/23/2025 - 01:05

గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఓ వర్క్‌ షాప్‌ సందేశాత్మక సంభాషణకు వేదికైంది. ప్రముఖ తారలు సుహాసిని–ఖుష్బూ ఈ వర్క్‌షాప్‌లో తమ అనుభవాలు, అబీప్రాయాలు, నటనలో మెళకువలను పంచుకున్నారు. తన ప్రశ్నలు తానే వేసుకుని తానే సమాధానాలు చెప్పడం ద్వారా సుహాసిని ఆసక్తిని పెంచగా, ఖుష్బూ తన అనుభవాలను పంచుతూ, హాజరైనవారిని అలరించారు. సంపూర్ణంగా అంకితం కావాలి... నటన అంటే ఏ కేటగిరీ అయినా సంపూర్ణ అంకితభావం తప్పనిసరి అని వీరిద్దరూ స్పష్టం చేశారు. ‘‘పారలల్‌ సినిమా–కమర్షియల్‌ సినిమా అని తేడా లేదు. ఏ సినిమా కైనా పని తీరు మాత్రం ఒకటే’’ అని ఖుష్బూ స్పష్టం చేశారు. 

చిత్రకళ, కెమెరా టెక్నిక్‌లలో శిక్షణ పొందిన సుహాసిని సాంకేతిక అంశాలపై సూచనలు ఇచ్చారు. ‘‘ఐ లైన్స్, టైమింగ్, కెమెరా ఎలా పని చేస్తాయో తెలుసుకోండి. కెమెరాను ఎలా డీల్‌ చేయాలో నేర్చుకోండి. రియలిజయ్‌ కూడా ఓ స్థాయి దాటకూడదు’’ అని సూచనలు చేశారు. నటీనటులు సంభాషణలను ఎప్పుడూ తమ స్వభాషలో నేర్చుకోవాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఇద్దరూ తమ తరానికి చెందిన క్రమశిక్షణను నేటి యువతకు చెప్పారు. ‘‘15 నిమిషాల్లో మేకప్‌ పూర్తి చేయడం, సమయాన్ని గౌరవించడం వంటి విషయాల్లో బాధ్యతగా ఉండాలి’’ అని ఖుష్బూ తెలిపారు.

సుహాసిని తనకు ఎదురైన తొలి వైఫల్యం గురించి చెప్పిన విషయం ప్రేక్షకుల నుంచి చప్పట్లను అందుకుంది. ‘‘నా తొలి తెలుగు సినిమా (కొత్త జీవితాలు)  సూపర్‌ ఫ్లాప్‌. కానీ 100 తెలుగు సినిమాలు చేశాను. అదృష్టాన్ని కాదు... నిరంతర కృషినే నమ్మాలి... విజయానికి మూలం అదే అన్నారు. ‘‘యాక్షన్‌–కట్‌ మధ్యలోనే జననం–మరణం అన్నట్టు ఉంటుంది’’ అన్నారు సుహాసిని.  

‘మీలోని చిన్నప్పటి నటì  ఇప్పుడు మీకు ఎదురైతే మీరు ఏం చెప్పాలనుకుంటారు?’ అన్న ప్రేక్షకుల ప్రశ్నకు ‘‘ఇంకా కొంచెం బాగా చేయమని చెబుతాను’’ అని ఖుష్బూ చెప్పగా, ‘‘నేను కొన్ని అర్థం చేసుకోవడంలో నా చిన్నప్పటి స్థితి చూసి సిగ్గుపడతాను. స్వేచ్ఛగా ఉండమని చెబుతాను’’ అన్నారు సుహాసిని. ఇక ఓపాటకు ఖుష్బూ పెదాలు కదపగా, శాస్త్రీయ అభినయంతో సుహాసిని ఆకట్టుకున్నారు. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి  
 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి