Breaking News

అలాంటప్పుడే నటీమణులకు గౌరవం పెరుగుతుంది: సుహాసిని

Published on Fri, 11/22/2024 - 19:13

తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే నటీమణులకు తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది అన్న అభిప్రాయం ఇఫీ (భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) సదస్సులో వ్యక్తమైంది. సినీ ఇండస్ట్రీలో మహిళా భద్రత అనే అంశంపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా నటి సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. సినిమాల్లో ఏదో అలా వచ్చి ఇలా పోయేవి కాకుండా మెరుగైన కీలక పాత్రల కోసం మహిళలు ప్రయత్నించాలన్నారు. 

భద్రత, గౌరవం కావాలి
పరిశ్రమలో వర్క్ ఎథిక్స్ గురించి అవగాహన పెoచాలని పిలుపునిచ్చారు. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. నటీమణులు వేధింపులకు గురయ్యే  అవకాశం లేని సినిమా సెట్‌లను రూపొందించాలన్నారు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలన్నారు. కుష్బూ సుందర్ మాట్లాడుతూ వినోదంపై దృష్టి సారిస్తూనే, సమానత్వానికి కూడా ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా సినిమాలను రూపొందించాలన్నారు. 

లింగ వివక్షపై చర్చ
అలా ఈ సదస్సులో పని చేసే చోట భద్రత, సమానత్వం, సినిమా పాత్రలపై చర్చించారు. లింగ వివక్ష ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్యానెలిస్ట్‌లు ఏకగ్రీవంగా అంగీకరించారు. మహిళల భద్రతకు సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ప్యానెల్ ముగిసింది. ఇకపోతే భారత్ హై హమ్ పేరిట దూరదర్శన్‌లో ప్రసారం కానున్న యానిమేషన్ సిరీస్ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. 

ఇసుకలో అద్భుతాలు
అలాగే ప్రఖ్యాత ఆర్టిస్ట్  సుందరం పట్నాయక్.. గోవాలోని మెరామర్ బీచ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాల సైకత శిల్పాలను తయారు చేశాడు. కాగా నవంబర్‌ 20న.. 55వ ఇఫీ ( భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) వేడుకలు గోవాలో మొదలయ్యాయి. ఈ సెలబ్రేషన్స్‌ ఈ నెల 28 వరకు జరగనున్నాయి.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)