పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!
Breaking News
మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేస్తే..?
Published on Tue, 06/17/2025 - 19:18
కొన్నిసార్లు ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి దగ్గరకు వెళ్తుంది. ఊహించని బ్లాక్‌బస్టర్ అయితే.. అరె ఈ మూవీ మా హీరో చేసుంటే బాగుండేదేమో అని అభిమానులు బాధపడుతుంటారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ వల్ల లేనిదాన్ని కూడా సృష్టించేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' సినిమా చేసుంటే ఎలా ఉండేదా అని ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: కాంచీవరం చీరలో పూజా.. పేపర్ డ్రస్సులో అషు)
'వన్: నేనొక్కడినే' సినిమా తర్వాత మహేశ్ బాబు.. సుకుమార్‌తో మరో సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో కాంబో సెట్ కాలేదు. అయితే అప్పుడు మహేశ్‌కి 'పుష్ప' కథే చెప్పారని, కానీ తనకు సెట్ కాదనే ఉద్దేశంతో వదులుకున్నారనే రూమర్స్ వచ్చాయి. తర్వాత సుక్కు.. అల్లు అర్జున్‌తో 'పుష్ప' చేయడం, ఇది పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఇప్పుడు మరి ఎవరు చేశారో గానీ మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేసుంటే ఎలా ఉండేదో అని చెబుతూ ఓ ఏఐ వీడియోని సృష్టించారు. ఇందులో పలు హిట్ సీన్స్‌ని రీ క్రియేట్ చేయడం బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మహేశ్ సినిమాల విషయానికొస్తే చివరగా 'గుంటూరు కారం'తో పలకరించారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఇదివరకే షూటింగ్ మొదలైంది కూడా. ఇందులో మహేశ్ సాహసికుడిగా కనిపించబోతున్నారు. 2027లో ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. అప్పటివరకు మహేశ్ ఫ్యాన్స్‌కి వెయిటింగ్ తప్పదు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')
What if pushpa did by MB.. ?
" Mahesh Babu " pic.twitter.com/HcbRuNAnU8— Sᴜʀʏᴀ.. 🐦🔥 (@Wolverine9121) June 16, 2025
Tags : 1