Breaking News

స్టార్‌ హీరో సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం

Published on Sun, 04/20/2025 - 09:16

ధనుష్‌ సినిమా షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ధనుష్‌ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడ్లీ కడై’(Idli Kadai) (ఇడ్లీ కొట్టు) సినిమా కోసం వేసిన సెట్‌ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన అర్దరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. తేని జిల్లా అండిపట్టిలో కొద్దిరోజులుగా సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ధనుష్‌, నిత్యా మీనన్‌ మధ్య కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ఎలాంటి ఇ‍బ్బంది కలగలేదు. అయితే, సినిమా షూటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన కొన్ని పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

సుమారు 15 రోజులుగా ఆ ప్రాంతంలోనే  చిత్రీకరణ జరుగుతుంది. ధనుష్ ఇడ్లీ షాప్ సన్నివేశాలకు సంబంధించిన సెట్‌ను అక్కడ వేశారు. మొదట అందులో నుంచే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. ఇడ్లీ కొట్టు చిత్రాన్ని ధనుష్, ఆకాష్‌ భాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ‘తిరు’ (2022) సినిమా తర్వాత ధనుష్‌–నిత్యా మీనన్‌ మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్‌ విజయ్, ప్రకాశ్‌రాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్‌ 1న  ఈ మూవీ విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్‌ ప్రకటించారు.

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)