Breaking News

అల్లు అర్జున్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. అసలేం జరిగిందంటే?

Published on Sun, 08/10/2025 - 13:57

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ గురించి పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తు పడతారు. పుష్ప తర్వాత బన్నీ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. మనదేశంతో పాటు వరల్డ్‌ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్‌ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది

ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో బిజీ అయిపోయారు ఐకాన్ స్టార్. ఇటీవలే ముంబయి ట్రిప్‌కు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

అయితే ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో బన్నీకి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ముఖానికి మాస్క్, అద్దాలు తీసి ఫేస్ చూపించాలని అడిగారు. పక్కనే ఉన్న వ్యక్తిగత సిబ్బంది అల్లు అర్జున్‌ ‍అని చెప్పినా కూడా వినలేదు. భద్రతా కారణాల దృష్ట్యా నిబంధనల ప్రకారం మొహం చూపించాల్సిందేనని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది అడిగారు. దీంతో బన్నీ వెంటనే మాస్క్‌, కళ్లద్దాలు తొలగించి ఫేస్ చూపించి లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. స్టార్ హీరోలను చూస్తే సెల్ఫీల కోసం జనాలు ఎగబడతారని గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వెళ్లడం సాధారణమే.. అయినప్పటికీ విమానాశ్రయాల్లో రూల్స్‌ ఎవరికైనా ఒక్కటే కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)