Breaking News

కొచ్చిలో పుష్ప-2 ఫీవర్‌.. ‍అల్లు అ‍ర్జున్‌ కొత్త పేరేంటో తెలుసా?

Published on Wed, 11/27/2024 - 19:03

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్‌ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్‌ సాంగ్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఐకాన్ స్టార్‌కు తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్‌ పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. లివా మాల్‌లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరగనుంది.

ఈ భారీ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్‌ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఐకాన్ స్టార్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు. అయితే పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసిన పుష్ప-2 వెల్‌కమ్‌ పోస్టర్‌ మాత్రం బన్నీ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్‌ పేరును ముద్దుగా మల్లు అర్జున్‌ అంటూ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌ స్పెషల్ ‍అట్రాక్షన్‌గా నిలిచింది.

allu

కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, కిస్సిక్‌ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. ఓవర్‌సీస్‌లో టికెట్‌ బుకింగ్‌ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)