Breaking News

'ఐ-బొమ్మ' రవి అరెస్ట్‌.. పోలీసుల చేతిలో కీలక ఆధారాలు!

Published on Sat, 11/15/2025 - 18:29

పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ(iBomma ) నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో రవి(Immadi Ravi)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టుకి తరలించారు. రవి నుంచి వైరసీ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.  రవి  ఆంధప్రదేశ్‌లోని వైజాగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్‌లో అతడి ఫ్లాట్‌ నుంచి హార్డ్‌ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను హోల్డ్‌ చేసినట్టు సమాచారం.  

రవిని అదుపులోకి తీసుకొని విచారించగా..సంచలన విషయాలు బయటపడ్డాయట.  పైరసీ వెబ్‌సైట్‌ని రన్‌ చేస్తున్న మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంతమందిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. 

తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్‌ యాంటీ పైరసీ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సైట్‌ నిర్వాహకులు పోలీసులకు సవాలు విసిరారు. ఆ ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. శనివారం ఉదయం   కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)