Breaking News

ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. క్రేజీ కాన్సెప్ట్

Published on Sat, 10/31/2026 - 14:25

దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో గానీ తెలుగులోనూ చాలామంది అభిమానులున్నారు. సీతారామం, మహానటి చిత్రాలతో హీరోగా హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార, శ్రీశ్రీ అనే టాలీవుడ్ మూవీస్ చేస్తున్నాడు. ఇవి రాబోయే మూడు నాలుగు నెలలో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఇతడు నటించిన మలయాళ ఫాంటసీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)

దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా చేసిన థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్'. నహాస్‌ హిదయత్‌ దర్శకుడు. గత నెల 03న థియేటర్లలోకి వచ్చింది. కాన్సెప్ట్ క్రేజీగానే ఉన్నప్పటికీ ఎందుకనో వర్కౌట్ కాలేదు. ఇప్పుడీ చిత్రం దాదాపు రెండు నెలల తర్వాత అంటే వచ్చే శుక్రవారం(నవంబర్ 06) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

'ఐ యామ్ గేమ్' విషయానికొస్తే.. డ్యాన్‌ జాన్‌ (దుల్కర్‌ సల్మాన్‌) చదువు పూర్తి చేసి తండ్రి కోరిక మేరకు బిజినెస్‌ చేస్తుంటాడు. పనికన్నా గ్యాంబ్లింగ్‌ అంటేనే పిచ్చి. రూ.లక్షల్లో పోగొట్టుకున్నా అప్పు తెచ్చి మరీ జూదమాడుతుంటాడు. అప్పుల వాళ్ల చేతిలో తన్నులు తినడంతో తల్లి మెర్సీ (జయసుధ) తాను దాచుకున్న రూ.60 లక్షలు ఇతడికి ఇస్తుంది. వాటిని తీసుకెళ్లి క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడి పోగొడతాడు. తన డబ్బులు ఇచ్చేయమని బెట్టింగ్‌ నిర్వాహకులను బెదిరించి వాటిని తీసుకుని కారులో పారిపోతుండగా యాక్సిడెంట్‌ అయి కుడి చేయి కోల్పోతాడు. దీంతో వైద్యులు డ్యాన్‌కు ఆపరేషన్‌ చేసి వేరొకరి చేయిని అతికిస్తారు. అక్కడే ఇషా(కాయదు లోహర్) పరిచయమవుతుంది.

ఇకపోతే డ్యాన్‌ కుడి చేయి అతడి కంట్రోల్‌లో ఉండదు. అది చేయాలనుకున్న పనులు చేసేస్తూ ఉంటుంది. తొలుత కంగారు పడినా, డ్యాన్‌ నెమ్మదిగా కుడి చేయి చేసే పనులకు అలవాటు పడతాడు. ఒకరోజు ఓ బెట్టింగ్‌ సెంటర్‌కు వెళ్లి మద్యం సేవిస్తుండగా, అక్కడకు డేవిడ్‌ (మిస్కిన్‌) వస్తాడు. అతడిని చూడగానే కుడి చేయి కత్తి తీసుకుని డేవిడ్‌ను చంపడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని డ్యాన్ కష్టమ్మీద అడ్డుకుంటాడు. ఇంతకీ డ్యాన్‌కు అమర్చిన కుడి చేయి ఎవరిది? దానికి అంత శక్తి ఎలా వచ్చింది? డేవిడ్‌ను ఎందుకు చంపాలనుకుంది? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)

Videos

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. అవాక్ అవ్వాల్సిందే.. తులం ఎంతుందంటే..!

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)