Breaking News

ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్‌ సేతుపతి

Published on Mon, 09/06/2021 - 11:44

Vijay Sethupathi Says NO To Krithi Shetty: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతికి తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. ఇటీవలె విడుదలైన ఉప్పెన సినిమాతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. తాజాగా శ్రుతిహాసన్‌తో కలిసి లాభం అనే సినిమాలో నటించారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

'ఉప్పెన మూవీ అనంతరం తమిళంలో ఓ ప్రాజెక్టు చేశాను. అందులో మొదట హీరోయిన్‌గా కృతిశెట్టి అయితే బావుంటుందని మూవీ టీం భావించారు. ఈ విషయం నాతో చెప్పగానే నేను ఈ సినిమా చేయను అని చెప్పాను. ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించి, ఇప్పుడు రొమాన్స్‌ చేయమంటే నేను చేయలేనని చెప్పా.  ఉప్పెనలో కృతి శెట్టికి నేను తండ్రిగా నటించిన విషయం యూనిట్‌ సభ్యులకు తెలియదు.

అందుకే మొదట ఆమెను హీరోయిన్‌గా అనుకున్నారు. భవిష్యత్తులోనూ కృతిశెట్టితో సినిమా చేయను. ఉప్పెన చిత్రం క్లైమాక్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడింది. దీంతో నాకు నీ అంత వయసున్న కొడుకు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. భయపడకు..ధైర్యంగా చెయ్‌ అని ప్రోత్సహించాను. కాబట్టి కూతురిలా భావించిన కృతిశెట్టితో జోడీలా నటించడం నా వల్ల కాదు' అని విజయ్‌ సేతుపతి పేర్కొన్నారు. 

చదవండి : 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు'
నర్సులతో కలిసి సినిమా చూస్తున్న విజయకాంత్‌

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)