Breaking News

అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్.. లియోకు మరో బిగ్ షాక్!

Published on Tue, 10/17/2023 - 16:49

దళపతి విజయ్ లియో మూవీ విడుదలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడులో బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిర్మాతలకు చుక్కెదురైంది. తాజాగా తెలుగు వర్షన్‌ అయినా బెనిఫిట్ షోలు చూడొచ్చని భావించిన అభిమానులకు మరో షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు వెర్షన్‌ రిలీజ్‌పై స్టే విధిస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 20వ తేదీ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. 

(ఇది చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!)

లియో తెలుగు వర్షన్ ఈనెల 19న విడుదల చేయవద్దంటూ సిటీ సివిల్ కోర్టు  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. లియో టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ ప్రతినిధులు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. డి స్టూడియోస్ పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నెల 20 వరకు  విడుదల చేయవద్దని ఆదేశాలిచ్చింది. 

తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!

ఈ నిర్ణయంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమిళంలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తెలుగులోనైనా మార్నింగ్ షోలు చూడొచ్చని అభిమానులు భావించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్స్ కొనుగోలు చేసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లో లియోకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి.  లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా..  బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, అర్జున్‌ సర్జా కీలక పాత్రలు పోషించారు. 

(ఇది చదవండి: ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!)

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు