Breaking News

నీ కంటి చూపులతో కలలను ఉరితీశావే!

Published on Tue, 10/07/2025 - 03:55

‘హుడియో హుడియో...’ అంటూ శ్రీలీలతో ఆడి  పాడుతున్నారు రవితేజ. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్‌ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్‌. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో రవితేజ– హీరోయిన్‌ శ్రీలీల కలిసి ‘మాస్‌ జాతర’ లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది.

 భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘హుడియో హుడియో...’ అంటూ సాగే  పాట ప్రోమోని విడుదల చేశారు మేకర్స్‌. ‘నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే... నీ సుట్టు పక్కల తిరిగేలా గిరి  గీశావే... నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేసావే... నీ కంటి చూపులతో కలలను ఉరితీశావే...’ అంటూ ఈ  పాట సాగుతుంది. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌  పాడిన ఈ పూర్తి  పాట బుధవారం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఫణి కె.వర్మ.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)