Breaking News

వార్‌2 ఫలితంపై స్పందించిన 'హృతిక్ రోషన్‌'

Published on Sat, 10/04/2025 - 08:32

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్‌2..  ఆగష్టు 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస​్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ ఫ్రాంఛైజీలోకి ఎన్టీఆర్ రావడంతో వార్‌2 కోసం తెలుగు వారు కూడా మరింత ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, టాలీవుడ్‌లో దారుణమైన నెగటివ్‌ రివ్యూలు కనిపించడంతో పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి హృతిక్ రోషన్ ఒక పోస్ట్‌ చేశారు.

వార్‌2 గురించి హృతిక్ ఇలా చెప్పారు. 'వార్‌2లో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది. ప్రాజెక్ట్‌ మొత్తం చాలా రిలాక్స్‌డ్‌గా పూర్తి చేశాను. నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చాలా సులువు అయింది. ఒక నటుడిగా సినిమా కోసం నేను చేయాల్సింది చేశాను.  సెట్స్‌లో నా పని పూర్తి అయిన తర్వాత ఇంటికి రావడం.. మరుసటి రోజు షెడ్యూల్‌ ఏంటో చూసుకోవడం జరిగేది. నా దర్శకుడు అయాన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సెట్‌లో అతను ఎప్పుడూ కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమా చేస్తున్నంత కాలం ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించింది. నా పని నేను పూర్తి చేస్తే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం..  కానీ, వెనుక నుంచి మమ్మల్ని ఏదో పదేపదే ఆపుతున్న ఒక శబ్ధం వినిపించేది. ప్రతి సినిమా ఒక చిత్రహింసలా, ఒక గాయంలా ఉండాల్సిన పనిలేదు. జస్ట్ రిలాక్స్" అని హృతిక్ పోస్ట్ చేశాడు.

వార్ 2 సినిమాకి ఎక్కువగా నెగటివ్‌ రివ్యూలే వచ్చాయి. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన వార్ 2 రూ. 236.55 కోట్లు వసూలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలైన వార్ కంటే తక్కువ మొత్తంలో వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 318.01 కోట్లు వసూలు చేసింది.

 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)