Breaking News

హృతిక్ రోషన్ క్రిష్‌-4.. బిగ్ షాకిచ్చిన నిర్మాత!

Published on Sun, 03/16/2025 - 18:43

హృతిక్ రోషన్, ప్రీతి జింటా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి మిల్ గయా'. ఈ మూవీకి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ మూవీ సీక్వెల్‌గా వచ్చిన చిత్రం క్రిష్‌. ఈ మూవీలో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. ఆ తర్వాత వచ్చిన క్రిష్ -3లో  హృతిక్, ప్రియాంక, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో నటించారు. అలా ఈ సిరీస్‌లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.

అయితే ఈ సిరీస్‌లో క్రిష్-4 రానుందని చాలాకాలంగా బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌ను సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించనున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ మూవీకి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారని టాక్ వినిపించింది. ఈ మూవీకి తాను డైరెక్షన్‌ చేయడం లేదని హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో  స్పష్టం చేశారు.

అయితే తాజాగా ఈ నిర్మాణ బాధ్యతల నుంచి సిద్ధార్థ్ ఆనంద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.700 కోట్ల భారీ బడ్జెట్ కావడంతోనే సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఆలోచనలో పడ్డారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అందుకే నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలగారని సమాచారం. తాజా పరిణామాలు చూస్తే అతనితో పాటు కరణ్ మల్హోత్రా‌ ఈ ప్రాజెక్ట్‌ తప్పుకున్నట్లు ‍అర్థమవుతోంది. దీంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్-4 ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సిద్ధార్థ్ ఆనంద్‌తో పాటు కరణ్‌ తప్పుకోవడంతో ఈ మూవీకి కొత్త దర్శకత్వంలో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. కొత్త టీమ్‌తో మళ్లీ బడ్జెట్‌ను అంచనా లు తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాకేష్ రోషన్ కూడా తాను దర్శకుడిగా చేయడం లేదని చెప్పడంతో మరో డైరెక్టర్‌ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. కాగా.. క్రిష్‌, క్రిష్‌ -3 చిత్రాలకు రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే క్రిష్-4 కూడా ఆయనే డైరెక్ట్ చేస్తాడని అభిమానులంతా భావించారు. కానీ తాజా ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం చేయడం లేదని చెప్పేశారు. ఈ బాధ్యతలు వేరే దర్శకుడికి అప్పగించనున్నట్లు వెల్లడించారుయ. అయితే ఇప్పుడు తాను డైరెక్ట్ చేసినా  బ్లాక్ బస్టర్ అవుతుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. అందుకే దర్శకత్వం మార్పు అవసరమని స్పష్టం చేశారు. 
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)