చచ్చిపోవాలనిపించింది.. ఎంతోమందిని కలిశా..

Published on Sun, 01/11/2026 - 15:49

చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడుతున్నప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలా తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు థెరపీ తీసుకుని చాలా మంచి పని చేశానంటోంది మలయాళ నటి పార్వతి తిరువోతు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థెరపీ తీసుకోవడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం. 

అర్ధరాత్రి థెరపీ
కాకపోతే మనకు కరెక్ట్‌ థెరపిస్ట్‌ దొరకాలి. అందుకు నాకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను అమెరికన్‌ థెరపిస్ట్‌ను కలిశాను. అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల సమయంలో నాతో మాట్లాడేవారు. తర్వాత ఇక్కడే ఉన్న థెరపిస్ట్‌లను సంప్రదించాను. వారు నా సమస్యలేంటో గుచ్చిగుచ్చి అడిగి.. వాటిని వెలికితీసి మరింత బాధపెట్టేవారు.

చచ్చిపోవాలన్న ఆలోచనలు
అప్పటికే నేను తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాను. చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కరెక్ట్‌ థెరపిస్ట్‌ దొరికాక నా బాధకు ఉపశమనం లభించింది. నన్ను ఎంతో బాధపెట్టిన 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్ని నా జీవితంలో నుంచే తీసేశాను. 

సినిమా
ప్రస్తుతం నేను కుటుంబం, ఫ్రెండ్స్‌, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. పార్వతి బెంగళూరు డేస్‌, ఎన్ను నింటె మొయిదీన్‌, చార్లీ, ఉయరె, వైరస్‌, పుళు వంటి పలు చిత్రాల్లో నటించింది. దూత వెబ్‌ సిరీస్‌తో తెలుగువారికి సైతం పరిచయమైంది.

గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)