ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Published on Tue, 03/24/2026 - 15:27
ఈ మధ్య సూపర్ హిట్ సినిమాలు కూడా నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్స్‌లో రిలీజ్‌కు ముందే ఓటీటీ రైట్స్‌ని అమ్మేసుకొని.. టాక్‌తో సంబంధం లేకుండా నెలలోపే ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఓ హారర్ చిత్రం మాత్రం రిలీజ్ అయినా ఏడాది తర్వాత ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది. అది కూడా తమిళ్ భాషలోనే స్ట్రీమింగ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఇంతకీ ఏ సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది?
'వైశాలి’తో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘శబ్దం’. గతేడాది ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కథ, కథనం రొటీన్‌గా ఉన్నా, టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారనే టాక్‌ని సంపాదించుకుంది కానీ, కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది.
అన్ని సినిమాల మాదిరే నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ, ఊహించని విధంగా ఏడాది తర్వాత ఇప్పుడు జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రావడం తెలుగు ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తెలుగు స్ట్రీమింగ్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.
శబ్దం కథేమింటి?
కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్‌లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Tags : 1