Breaking News

ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Published on Mon, 09/16/2024 - 14:07

మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్స్‌, ఓటీటీ ఎక్కడైనా మంచి ఆదరణ దక్కుతుంది. ఇలాంటి సినిమాలు ఒక్కోసారి థియేటర్స్‌లో చూడటం మిస్‌ అయిన వారు ఓటీటీలో తప్పకుండా చూస్తారు. ఈ క్రమంలోనే ఓటీటీలో ఈ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. ' చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో దూసుకెళ్తోంది. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ జోడీ నటన, కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.

అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్ వచ్చాయి. మున్ముందు ఈ చిత్రం ఇంకెంత మందిని ఆకట్టుకుని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)