Breaking News

ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్‌ ఎమోషనల్‌

Published on Mon, 11/17/2025 - 10:58

మలయాళ బ్యూటీ హనీరోజ్‌ (Honey Rose) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా తను ప్రధాన పాత్రలో నటించిన రాహెల్‌ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎమోషనల్‌ కామెంట్స్‌ చేసింది. హనీరోజ్‌ మాట్లాడుతూ.. మలయాళ సినిమాకు నా అవసరం ఉందా? అని నన్ను అడిగితే లేదనే చెప్తాను.  నేనే ఈ ఇండస్ట్రీకి గట్టిగా అతుక్కుపోయాను.

వేలు పట్టుకుని నడిపించారు
నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. దర్శకుడు వినాయన్‌ సర్‌ మొదటి నుంచి నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఈ సినిమాతో నా కెరీర్‌ టర్న్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారనుకుంటా! నాకు బోలెడన్ని అవకాశాలు రావాలి.. వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. వచ్చినవాటిలో ఉత్తమమైన వాటినే ఎంపిక చేసుకుంటాను. వాటికోసమే కష్టపడతాను. సినిమా అంటే నాకు అంత పిచ్చి అని హనీరోజ్‌ చెప్పుకొచ్చింది.

 ఊహించినదానికన్నా అద్భుతంగా..
వినాయన్‌ మాట్లాడుతూ.. మలయాళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ల కంటే కూడా హనీరోజ్‌ ఎక్కువ సంపాదిస్తుంది. ఆమెకు ఈవెంట్లు, ప్రోగ్రామ్‌ల ద్వారా మంచి ఆదాయం వస్తుంది. కానీ, తనకు డబ్బు కన్నా సినిమా అంటేనే ఎక్కువ ఇష్టం. రాహేల్‌లో హనీ.. నేను ఊహించినదానికన్నా అద్భుతంగా నటించింది అని చెప్పుకొచ్చాడు. ఈమె తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా, వీర సింహా రెడ్డి చిత్రాల్లో నటించింది.

చదవండి: రాహేలు ట్రైలర్‌ చూశారా?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు