Breaking News

భారీ ప్రాజెక్ట్‌.. 'మహావతార్‌: నరసింహ' గ్లింప్స్‌ విడుదల

Published on Sun, 05/11/2025 - 13:21

హోంబలే ఫిల్మ్స్‌ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్‌ చిత్రం 'మహావతార్‌: నరసింహ'.. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ విడుదలైంది. ఆపై సినిమా రిలీజ్‌ తేదీని కూడా మేకర్స్‌ ప్రకటించారు. కేజీఎఫ్‌,సలార్‌,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్‌ కుమార్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్‌ను గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(ఇఫ్ఫీ)లో ప్రదర్శించారు.

పాన్‌ ఇండియా రేంజ్‌లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జులై 25న  ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. సామ్‌ సీఎస్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌లు నిర్మిస్తున్నారు.  మహావతార్‌ సిరీస్‌లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్‌గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్‌ హిట్‌ ఇచ్చారు. యానిమేషన్‌లో ఈ చిత్రం ఒక బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేస్తుందని దర్శకుడు తెలిపారు.

ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఇందులో చూపిస్తున్నట్లు అశ్విన్‌ చెప్పారు. దీన్ని రూపొందించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింని ఆయన చెప్పారు. మహావతార్‌ సిరీస్‌లో రానున్న తొలి సినిమాగా 'మహావతార్‌: నరసింహ' తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా ఇతర అవతారాలతో మరో రెండు సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)