Breaking News

హోంబలే ఫిల్మ్స్‌ బిగ్‌ ప్రాజెక్ట్‌ 'మహావతార్‌' ప్రకటన

Published on Sat, 11/16/2024 - 16:09

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్‌ పరిచయం అవసరం లేని నిర్మాణ సంస్థ. ఈ సంస్థ నుంచి ఇప్పటికే కేజీఎఫ్‌,సలార్‌,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించింది. ఆపై ప్రభాస్‌తో మరో మూడు చిత్రాలను నిర్మిస్తున్నట్లు కూడ తెలిపింది. అయితే, తాజాగా ఈ సంస్థ ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌తో పాటు ఒక వీడియోను కూడా ప్రేక్షకులతో పంచుకుంది.

'మహావతార్‌: నరసింహ' అనే హిస్టారికల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్‌ అధికారికంగా ప్రకటించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ మూవీలో నటించనున్న నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. 

పాన్‌ ఇండియా రేంజ్‌లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో  ఈ చిత్రం విడుదల కానుంది. సామ్‌ సీఎస్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌లు నిర్మిస్తున్నారు.  మహావతార్‌ సిరీస్‌లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్‌గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్‌ హిట్‌ ఇచ్చారు.

హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థ నుంచి  కాంతార  ప్రీక్వెల్‌ చిత్రీకరణ జరపుకుంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషభ్‌శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు సలార్‌ పార్ట్‌2 శౌర్యంగ పర్వం కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంతో కలిపి ప్రభాస్‌తో మూడు భారీ చిత్రాలు ప్లాన్‌ చేసినట్లు ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)