Breaking News

నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!

Published on Sat, 06/07/2025 - 13:27

పెళ్లికి ముందు ప్రేమలు ఇప్పుడు కామన్‌ అయిపోయాయి. అయితే ఎన్ని లవ్‌స్టోరీలు ఉన్నా సరే పెళ్లి దగ్గరపడేసరికి వాటిన్నింటికీ ముగింపు పలికేసి కొత్త జీవితం మొదలుపెడుతున్నారు. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ ఎప్పటినుంచో ఉంది! ఎంతోమంది హీరో, హీరోయిన్లు అనేక లవ్వాయణాల తర్వాతే వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.

పెళ్లికి ముందు ప్రేమాయణం
స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. నటుడు హర్మాన్‌ బవేజా, షాహిద్‌ కపూర్‌, షారూఖ్‌ కపూర్‌ను ‍ప్రేమించినట్లు భోగట్టా! ఆ తర్వాతే అమెరికన్‌ సింగర్‌, నటుడు నిక్‌ జోనస్‌ (Nick Jonas)తో ప్రేమలో పడగా ఈసారి దాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లింది. అయితే నిక్‌ కూడా గతంలో అమెరికన్‌ సింగర్‌, నటి మిలే సైరస్‌ను ప్రేమించాడు. వీరిద్దరూ 2006- 2009 వరకు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు బ్రేకప్‌ చెప్పి ప్రియాంకను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు.

నన్ను దూరం పెట్టాడు
తాజాగా తన ప్రేమపురాణం గురించి సైరస్‌ (Miley Cyrus) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నాకు నిక్‌ అంటే చాలా ఇష్టం. నన్ను తన మ్యూజిక్‌ టూర్‌లో జాయిన్‌ చేసుకోనప్పుడు ఎంతో బాధపడ్డాను. ఏడ్చాను. తను నన్ను నెమ్మదిగా దూరం పెడుతున్నాడని అర్థమైంది. ఎందుకు నన్ను వదిలేస్తున్నావ్‌? అని నిలదీశాను. కలిసుందామని వేడుకున్నాను. కానీ ఫలితం లేకపోయింది.

వెధవ.. నన్ను వదిలేశాడు
నా బయోగ్రఫీలో కూడా నిక్‌ మంచివాడు కాదు, వెధవ.. నన్ను వదిలేశాడని బూతులు రాయాలనుకున్నాను. కానీ నా టీమ్‌ అతడ్ని తిడుతూ రాసేందుకు ఒప్పుకోలేదు. అయితే నిక్‌ ఇప్పటికీ దారితప్పిన పిల్లాడిలాగే కనిపిస్తాడు అని నవ్వేసింది. ఇకపోతే సైరస్‌ 2021 నుంచి మాక్స్‌ మొరండోతో డేటింగ్‌లో ఉంది. నిక్‌ విషయానికి వస్తే.. ప్రియాంకను పెళ్లి చేసుకోగా వీరికి సరోగసి ద్వారా మూడేళ్ల కూతురు మాల్తీ మారీ జన్మించింది.

చదవండి: మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్‌!

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)