Breaking News

'ద ట్రయల్‌ 2' రివ్యూ: ఈ సిరీస్‌ పెద్దల కోసమే!

Published on Sun, 09/28/2025 - 00:58

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో ‘ది ట్రయల్‌’ రెండో సీజన్‌ ఒకటి. ఈ సిరీస్‌ గురించి తెలుసుకుందాం.

ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్థుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీలలో ఎంతో మంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు. అటువంటి లా ఫర్మ్‌లపై తీసిన సిరీస్‌ ‘ది ట్రయల్‌’. 2023లో ఈ సిరీస్‌ మొదటి భాగం హాట్‌ స్టార్‌ వేదికగా రిలీజ్‌ అయింది. మళ్ళీ రెండేళ్ళకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2025లో ‘ది ట్రయల్‌’ రెండో సీజన్‌ రిలీజ్‌ అయింది. కాజోల్‌ ప్రధాన  పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్‌ దేవగన్‌ ఈ సిరీస్‌కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

రెండు సిరీస్‌లు కలిపి 14 ఎపిసోడ్లతో ఉన్న ‘ది ట్రయల్‌’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌ కథాంశానికొస్తే... న్యోనికాసేన్‌ గుప్తా ఓ పేరున్న ఫర్మ్‌లో మంచి లాయర్‌. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె చేస్తున్న లా ఫర్మ్‌లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్‌ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు. 

ఆ లా ఫర్మ్‌లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి. ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి. మరి... ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ, ఫర్మ్‌లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యోనికా నిజంగా ట్రయల్‌ గెలుస్తుందా? లేదా అన్నది మాత్రం సిరీస్‌లోనే చూడాలి. హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ‘ది ట్రయల్‌’ మంచి కాలక్షేపం. ఈ లా ఫర్మ్‌ కథలు పెద్దలు మాత్రమే చూడదగినవి. ఎంజాయ్‌..
– హరికృష్ణ ఇంటూరు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌