Breaking News

ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ.. ఆ నాలుగు పాత్రలపైనే ఆసక్తి!

Published on Thu, 07/03/2025 - 18:29

మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో చిత్రం అలరించేందుకు సిద్ధమైంది. ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్‌  జూలై 25న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో థియేటర్లలోకి రానుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌కి మధ్య జరగబోయే భీకర పోరాటం ఈ సినిమాలో చూపించనున్నారు. ఫైట్స్, విజువల్స్ చూస్తే ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేలా కనిపిస్తోంది. 1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్‌లో ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రంలోని నలుగురి పాత్రలపై ఓ లుక్కేద్దాం.  

రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ కనిపించనున్నారు.  ఫెంటాస్టిక్ ఫోర్‌కు నాయకుడిగా ఉంటారు. రీడ్ రిచర్డ్స్ తన శరీర ఆకృతి మార్చుకునే  సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సూ స్టార్మ్ (ఇన్విజిబుల్ ఉమెన్)గా వెనెస్సా కిర్బీ కనిపించనుంది. ఆమె  క్షిపణుల నుంచి వచ్చే ఇంటర్ డైమెన్షనల్ శక్తి దాడులను నిరోధించేంత శక్తివంతమైన పాత్ర పోషించింది. జానీ స్టార్మ్ (హ్యూమన్ టార్చ్) గా జోసెఫ్ క్విన్ నటించారు.  బెన్ గ్రిమ్ (ది థింగ్) పాత్రలో ఎబోన్ మోస్-బచ్రాచ్ కనిపిస్తారు.

కాగా.. ఈ చిత్రానికి మాట్ షాక్‌మాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కెవిన్ ఫీజ్ నిర్మించారు. 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్, సారా నైల్స్ కూడా కనిపించనున్నారు. 
 

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)