Breaking News

Carry On Review: కదలకుండా కట్టిపడేసే థ్రిల్లర్

Published on Sun, 12/22/2024 - 09:04

థ్రిల్లర్ జోనర్ అనేది సినిమా మొత్తం క్యారీ చేయడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. సినిమా ఓ లైన్ లో వెళుతున్నపుడు దాని జోనర్ ని కమర్షియల్ యాంగిల్ లో కూడా బ్యాలెన్స్ చేస్తూ క్యారీ చేయడం చాలా కష్టం. ఒకవేళ అలా పట్టు సడలకుండా క్యారీ చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ఆ కోవకే చెందిన సినిమా క్యారీ ఆన్. ఇదో హాలివుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో థ్రిల్లింగ్ జోనర్ లో వచ్చిన అరుదైన సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాకి దర్శకుడు జేమ్ కలెక్ట్ సేరా. ప్రముఖ హాలివుడు నటులు టారన్, సోఫియా లీడ్ రోల్స్ లో నటించారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే భార్యభర్తలైన ఈథన్ కోపెక్, నోరా పార్సీ అమెరికాలోని ఎయిర్ పోర్టులలో లగేజ్ సెక్యురిటీ తనిఖీ సంస్థ అయిన టిఎస్ఎ లో పని చేస్తూ ఉంటారు. అది క్రిస్మస్ కాలం. ఎయిర్ పోర్టు పండుగ వాతావరణంలో ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది. కొపెక్ తన ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని ఆ రోజు వేరే వాళ్ళు ఉండాల్సిన స్థానంలో తన పోస్ట్ వేయించుకుంటాడు. అది లగేజ్ స్క్రీన్ స్పెషలిస్ట్ డ్యూటీ. తాను రొటీన్ గా ప్రయాణీకుల లగేజ్ స్క్రీన్ చేస్తుండగా అనూహ్యంగా ఓ బ్లూటూత్ దొరుకుతుంది. ఆ బ్లూటూత్ కొపెక్ ధరించడంతో అసలు కథ మొదలవుతుంది.

ఓ అనామకుడు కొపెక్ ను బ్లూటూత్ ద్వారా  తాను చెప్పింది చెయ్యకుంటే అదే ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న తన భార్య నోరాని చంపుతానని బెదిరిస్తాడు. ఆ అగంతకుడు ఓ బాంబుని ఫ్లైట్ లోకి తరలించే ప్రయత్నిస్తుంటాడు. ఆ బాంబు బ్యాగేజీని లగేజ్ స్క్రీన్ దగ్గర కొపెక్ అడ్డుకోకూడదని అజ్ఞాత వ్యక్తి హెచ్చరిస్తూ బ్లూటూత్ ద్వారా కొపెక్ కు సూచనలిస్తుంటాడు. అసలే పండుగ కాలం ఎయిర్ పోర్టు నిండా జనం. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద సంఖ్యలో అపార ప్రాణ నష్టం. అందుకే కొపెక్ ఓ  పక్క ఆ లగేజ్ ని ఆపాలని మరో పక్క తన భార్యను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం సినిమాకే హైలైట్.

ముందుగా తనకు కనపడుకుండా తనను లక్ష్యంగా చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగడుతున్న ఆ హంతకుడిని వెతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కొపెక్ ఆ అగంతకుడి తో పాటు బాంబుని కనుక్కున్నాడా, అలాగే తన భార్యని కాపాడుకున్నాడా.. ఈ ప్రశ్నలకు సమాధానం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న క్యారీ ఆన్ సినిమాని చూడడం. ఈ సినిమా స్క్రీన్ ప్లే పైన చెప్పుకున్నట్టు ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాలో పాత్రలు పరిచయం అయ్యే దాకా మామూలు రొటీన్ సినిమా అనిపించినప్పటికీ బ్లూటూత్ దొరికినప్పటినుండి కథ వేగంగా పరిగెడుతూ ప్రేక్షకుడిని కదలకుండా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో లభ్యమవుతుంది. వర్త్ టు వాచ్ మూవీ ఈ క్యారీ ఆన్. సో యూ ఆల్సో క్యారీ ఆన్ ఫర్ క్యారీ ఆన్.
-ఇంటూరు హరికృష్ణ

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)