Breaking News

ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా?

Published on Sun, 10/13/2024 - 08:29

టైటిల్: ఇమ్మాక్యూలేట్

దర్శకత్వం: మైఖేల్ మోహన్

లీడ్‌ రోల్: సిడ్నీ స్వీని

నిడివి: 90 నిమిషాలు

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్‌

విడుదల తేదీ: మార్చి 22, 2024

ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లోనూ ఇటీవల ఆ జోనర్‌ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్‌లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.

గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి.  ఈ కథ మొత్తం నన్‌ల చుట్టు తిరుగుతుంది. నన్‌గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్‌కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.

నన్‌ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్‌ ప్లే నడిపించారు. ‍అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్‌లను ట్రీట్‌ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్‌ ఆడియన్స్‌ను భయపెట్టేస్తాయి. ఒక నన్‌  జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. హారర్‌ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్‌ లేకుండానే తెరకెక్కించాడు. 
 

ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్‌ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)