Breaking News

ఇక సినిమాల్లో చేయడానికి ఏమీ లేదు: హాలీవుడ్‌ దర్శకుడు

Published on Tue, 04/09/2024 - 09:03

హాలీవుడ్‌ సినీ చరిత్రలో దర్శకుడు-నటుడు ఉడీ అలెన్‌ది ప్రముఖ స్థానం. ముఖ్యంగా రొమాంటిక్‌ జానర్‌లో ఆయన తెరకెక్కించిన ‘అన్నీహాల్‌, మాన్‌ హాట్టన్‌, మిడ్‌నైట్‌ ఇన్‌ ప్యారిస్‌, టు రోమ్‌ విత్‌ లవ్‌, ఏ రెయినీ డే ఇన్‌ న్యూయార్క్‌’ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలు రొమాంటిక్‌ చిత్రాలు తెరకెక్కించిన ఉడీ అలెన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘రొమాన్స్‌ ఆఫ్‌ ఫిల్మ్‌మేకింగ్‌ ఈజ్‌ గాన్‌’ అన్నారు.

ఇక సినిమాల పరంగా చేయడానికి ఏమీ లేదన్నట్లుగా మాట్లాడారు 88 ఏళ్ల ఉడీ. ఆయన తెరకెక్కించిన ‘కూప్‌ ది చాన్స్‌’ గత ఏడాది ఫ్రాన్స్‌లో విడుదలైంది. దర్శకుడిగా ఉడీకి ఇది 50వ చిత్రం. ఇదే చివరి చిత్రం అన్నట్లుగా పేర్కొన్నారు. ఈ చిత్రం రిలీజ్‌ నార్త్‌ అమెరికాలో లేట్‌ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఉడీ అలెన్‌ మాట్లాడుతూ..‘నేనొక సినిమా చేశాక దాని గురించి పట్టించుకోను. డిస్ట్రిబ్యూషన్‌ అనేది నా పని కాదు. ఇప్పుడు పంపిణీ అంటే ఏ మూవీ అయినా రెండు వారాలే. ఒకప్పుడు నా ‘అన్నీహాల్‌’ సినిమా న్యూయార్క్‌ థియేటర్‌లో ఏడాది ఆడింది. ఒక థియేటర్‌లో 6,7 నెలలు ఆడాక వేరేవాళ్లు తీసుకునేవారు. అక్కడ కొన్ని నెలలాడేది. కానీ ఇప్పుడు సినిమా వ్యాపారం మారిపోయింది.ఈ మార్పు ఆకర్షనీయంగా లేదు’ అన్నారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)