Breaking News

హాలీవుడ్‌ నటి రాక్వెల్‌ వెల్చ్‌ కన్నుమూత

Published on Fri, 02/17/2023 - 02:44

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాలీవుడ్‌ నటి రాక్వెల్‌ వెల్చ్‌ (82) తుది శ్వాస విడిచారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌ స్టేట్‌ చికాగోలో 1940 సెప్టెంబర్ 5న రాక్వెల్‌ వెల్చ్‌ జన్మించారు. ఆమె అసలు పేరు జో రాక్వెల్‌ టెజేడా.  హైస్కూల్ చదువుతున్న రోజుల్లో ‘ఫెయిరెస్ట్‌ ఆఫ్‌ ద ఫెయిర్‌’గా పేరు పొందారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, స్టేట్‌ కాలేజ్‌లో థియేటర్‌ ఆర్ట్స్‌లో చేరారు రాక్వెల్‌. ‘ఎ హౌస్‌ ఈజ్‌ నాట్‌ ఎ హోమ్‌’ (1964)లో చేసిన చిన్నపా త్ర ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు.

1966లో వచ్చిన  ‘ఫెంటాస్టిక్‌ వాయేజ్‌’లో ఓ లీడ్‌ రోల్‌ చేసిన రాక్వెల్‌కు మంచి గుర్తింపు లభించింది. 1973లో ‘ద త్రీ మస్కటీర్స్‌’కి ఆమెకు ఉత్తమ నటిగా ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు లభించింది. 1995లో ‘ది ఎంపైర్‌’ మ్యాగజీన్‌ ప్రచురించిన ‘100 సెక్సియస్ట్‌ స్టార్స్‌ ఆఫ్‌ ట్వంటీయత్‌ సెంచురీ’లో ఒకరిగా, మరో మ్యాగజీన్‌ ‘ప్లే బాయ్‌’ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచారామె. రాక్వెల్‌ చివరి చిత్రం ‘హౌ టు బి ఏ లాటిన్‌ లవర్‌’ (2017). ఇక 1959లో జేమ్స్‌ వెల్చ్ ను పెళ్లాడారామె. వీరికి ఇద్దరు సంతానం. వెల్చ్‌ నుంచి విడిపోయాక దాదాపు మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఆయన ‘ఇంటి పేరు’తోనే కొనసాగారామె. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)