Breaking News

తమిళ డైరెక్టర్‌ కొడుకు హీరోగా ‘ హిట్‌ లిస్ట్‌’

Published on Sat, 05/25/2024 - 16:32

తమిళ స్టార్‌ డైరెక్టర్‌  విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.

యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా నేడు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు విచ్చేశారు. వీరితోపాటు నిర్మాత, దర్శకుడు కె. ఎస్. రవికుమార్ గారు, హీరో విజయ్ కనిష్క, దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బెక్కం రవీంద్ర గారు పాల్గొన్నారు.

శ్రీ మురళీమోహన్ గారు మాట్లాడుతూ : హీరో విజయ్ కనిష్క నాన్నగారు విక్రమన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. నాకు బాగా సన్నిహితుడు కె. ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతక వ్యవహరించడం మంచి విషయం. ట్రైలర్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ : నన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కె. ఎస్. రవికుమార్ గారికి టీం కి నా అభినందనలు తెలుపుతున్నాను. మంచి నిర్మాత దర్శకులు కె. ఎస్. రవికుమార్ గారు. విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి విజయం అవుతుందని టీమ్ అందరికీ మంచి సక్సెస్ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. 
 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)