Breaking News

క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు

Published on Mon, 01/27/2025 - 11:27

సంపద, సంతోషం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ కష్టాలు, బాధలో ఉన్నప్పుడే అయినవాళ్లెవరో, కానివాళ్లెవరో తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాళ్లు చాలా తక్కువమంది. కానీ హీనా ఖాన్‌కు.. ఆమె కష్టాన్ని తన కష్టంగా భావించే ప్రియుడు దొరికాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న నటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.

నాకోసం గుండు కొట్టించుకున్నావ్‌..
ఇంత మంచి భాగస్వామి దొరకడం నా అదృష్టం అంటూ ప్రియుడు రాకీ జైస్వాల్‌ (Rocky Jaiswal)ను పొగుడుతూ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది హీనా ఖాన్‌ (Hina Khan). నాకు తెలిసిన మంచి వ్యక్తి ఇతడే! ట్రీట్‌మెంట్‌లో భాగంగా నేను గుండు చేయించుకున్నప్పుడూ అతడూ గుండు కొట్టించుకున్నాడు. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడే తన జుట్టు పెరగనిస్తానన్నాడు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వంద కారణాలు చెప్పి వెళ్లిపోయే అవకాశం ఉన్నా నాతోనే ఉన్నాడు. నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. జీవితకాలమంత అనుభవాన్ని మేము ఇప్పటికే పోగు చేసుకున్నాం.

కరోనా సమయంలోనూ నాతో..
సంతోషకర, బాధాకర సందర్భాల్లో కలిసున్నాం. మా తండ్రుల్ని కోల్పోయినప్పుడు ఇద్దరమూ ఏడ్చాం. ఒకరినొకరం ఓదార్చుకున్నాం. కరోనా సమయంలోనూ కలిసే ఉన్నాం. అప్పుడు నాకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అతడికి వైరస్‌ సోకకపోయినా నాతోపాటే కలిసున్నాడు. మూడు మాస్కులు ధరించి నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. క్యాన్సర్‌ బారిన పడ్డప్పుడు కూడా నా చేయి వదల్లేదు. అన్నీ వదిలేసి నాతోనే ఉంటున్నాడు.

(చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్‌ వార్తలపై సిరాజ్‌ రియాక్షన్‌)

సరైన దారిలోనే వెళ్తున్నా..
ఎక్కడ ‍ట్రీట్‌మెంట్‌ బాగుంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల్ని అడగాలి.. ఇలా అన్నీ ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాడు. అలా అతడు సూచించిన కరెక్ట్‌ డైరెక్షన్‌లోనే నేను అడుగులు వేస్తున్నాను. కీమో థెరపీ ప్రారంభించినప్పటి నుంచి నా బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. నాకు డ్రెస్సింగ్‌ చేయడం, తినిపించడం.. ఇలా అన్నీ తనే చేస్తున్నాడు. నా చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించాడు. గడిచిన రెండు నెలలు నాకెంతో నేర్పాయి.

బాధపెట్టి ఉంటే క్షమించు
నా జీవితంలో నువ్వు నాకు దొరికిన అద్భుతానివి. నన్ను ధైర్యంగా నిలబడమన్నావ్‌.. నన్ను నేను ప్రేమించుకోమన్నావ్‌.. ఆందోళనను వదిలేసి ప్రశాంతంగా శ్వాస తీసుకోమన్నావ్‌.. నీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నేను నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు. మనం కలిసి నవ్వుకునేవాళ్లం, ఏడ్చేవాళ్లం, ఒకరి కన్నీటిని మరొకరు తుడిచేవాళ్లం.. అప్పటికీ, ఇప్పటికీ ఇదే జరిగింది. భవిష్యత్తులో కూడా మన మధ్య ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

గతేడాది క్యాన్సర్‌ బారిన పడ్డ నటి
ఇతడు దేవుడు పంపిన ఆశీర్వాదం అని హాస్పిటల్‌ సిబ్బంది, డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి మంచి వ్యక్తి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీరు ఎప్పటికీ ఇలాగే కలిసుండాలని కామెంట్లు చేస్తున్నారు. టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కెరీర్‌లో పుంజుకుంటున్న సమయంలో క్యాన్సర్‌ హీనా ఖాన్‌పై దాడి చేసింది. గతేడాది నుంచి మూడో దశ బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో నటి పోరాడుతోంది.

 

 

చదవండి: పెళ్లిరోజు నాడే గుడ్‌న్యూస్‌.. తల్లిదండ్రులైన టాలీవుడ్‌ జంట

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)