Breaking News

నేను వాడిపడేసిన టిష్యూ ఏరుకుంది: నటి

Published on Thu, 06/06/2024 - 16:52

వెర్రి వేయిరకాలంటారు. ముఖ్యంగా కొందరు వీరాభిమానుల ప్రవర్తన వెర్రితనంలాగే కనిపిస్తుంది. అందుకు హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్‌ చెప్పిన సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం హీనా ఖాన్‌ నటించిన నామాకూల్‌ అనే వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ మినీటీవీలో ప్రసారమవుతోంది. అందులో అందరూ ఇష్టపడే టీచర్‌ పాత్రను పోషించింది.

కన్నార్పకుండా చూసేది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఇబ్బందికర సంఘటనను పంచుకుంది. ఓ ప్రాజెక్ట్‌ కోసం ఉత్తరాఖండ్‌ షూటింగ్‌లో పాల్గొన్నాను. అది జనాలు తిరుగుతూ ఉండే ప్రదేశం. ఒక అమ్మాయి రోజూ అక్కడికి వచ్చి నన్ను కన్నార్పకుండా చూస్తుండేది. తనను గమనించి పిలిచి మాట్లాడాను. తనతో కాసేపు కాలక్షేపం చేశాను. కానీ కొద్దిరోజులకు తను అలాగే చూస్తూ ఉండటం నాకు కొంత అసౌకర్యంగా అనిపించింది. 

ఇబ్బందిపడ్డా..
పూర్తిగా నా మీదే దృష్టి పెట్టకుండా కాస్త చుట్టుపక్కల కూడా చూడమని నా టీమ్‌తో చెప్పించాను. నేను ఇబ్బందిపడుతున్నానని అర్థమవడంతో వెంటనే వెళ్లిపోయింది. కానీ మర్నాడే సెట్‌కు వచ్చింది. ఆరోజు నేను బాధాకరమైన సీన్‌లో నటించాలి. ఏడుస్తూ ఉన్నాను. కాసేపటికి టిష్యూతో కళ్లు తుడుచుకుని దాన్ని చెత్తబుట్టలో పడేశాను. వెంటనే ఆ అమ్మాయి డస్ట్‌బిన్‌ అంతా వెతకడం మొదలుపెట్టింది. 

భయపడిపోయా
నేను వాడిన టిష్యూను అందులో నుంచి తీసుకుని జాగ్రత్తగా తన వద్ద పెట్టుకుంది. ఆమె అలా చేయడం చూసి నేను షాకయ్యాను.. చెప్పాలంటే భయపడ్డాను కూడా! అభిమానం ఉండొచ్చు, కానీ దానికి కూడా హద్దులుండాలి అని హీనా ఖాన్‌ చెప్పుకొచ్చింది. కాగా యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో గుర్తింపు పొందిన హీనా ఖాన్‌ కసౌటి జిందగీ కే, నాగిన్‌ (5వ సీజన్‌) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది. హిందీ బిగ్‌బాస్‌లోనూ అలరించింది.

చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్‌గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)