Breaking News

క్యాన్సర్‌తో నటి పోరాటం.. ఇప్పుడు తినడానికి కూడా కష్టంగా..!

Published on Fri, 09/06/2024 - 18:26

క్యాన్సర్‌తో పోరాడటం అంత ఈజీ కాదు. అయినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ మహమ్మారిని జయించే దిశగా పోరాడుతోంది హిందీ బుల్లితెర నటి హీనా ఖాన్‌. ప్రస్తుతం తనకు రొమ్ము క్యాన్సర్‌ మూడో స్టేజీలో ఉండటంతో వెంటనే కీమో థెరపీ ప్రారంభించారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌
అయితే వరుస కీమోథెరపీల వల్ల తన శరీరంపై కాలిన మచ్చలు ఏర్పడటంతో పాటు తాజాగా మ్యుకోసైటిస్‌ వ్యాధి బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. కీమో థెరపీ చేయించుకోవడం వల్ల వచ్చిన సైడ్‌ ఎఫెక్టే మ్యుకోసైటిస్‌. వైద్యుల సూచన మేరకు దానికి కూడా చికిత్స తీసుకుంటున్నాను. మీలో ఎవరికైనా దీన్ని ఎలా నివారించాలో తెలిస్తే దయచేసి నాకు సాయం చేయండి. 

సలహా ఇవ్వండి
ఎందుకంటే భోజనం కూడా చేయలేకపోవడం చాలా కష్టం కదా! మీరు ఇచ్చే సలహాలు నాకెంతో మేలు చేస్తాయి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వైద్యుల చికిత్సనే ఫాలో అయిపో.. పొరపాటున సొంత ప్రయోగం వికటించిందంటే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది అని కొందరు హెచ్చరించారు.

మ్యుకోసైటిస్‌ అంటే..
కీమోథెరపీ దుష్ప్రభావాల్లో మ్యుకోసైటిస్‌ అనేది ఒకటి. దీనివల్ల గొంతు, నోరు, అన్నవాహిక, కడుపు, పేగుల్లో ఉండే శ్లేష్మపొరలు వాచిపోతాయి. నోటిలో అల్సర్లు కూడా కనిపిస్తాయి.  దీనివల్ల ఆహారం తినలేరు, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు. కొందరికైతే నోటి నుంచి రక్తం కూడా వస్తుంది.

 

 

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)