హైకోర్టు హెచ్చరించినా లెక్కచేయని 'ఓజీ'

Published on Thu, 09/25/2025 - 11:26

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఓజీ’ సినిమా బెనిఫిట్‌ షోతో పాటు టికెట్‌ ధరలను భారీగా పెంచేశారు. అయితే,  హోంశాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో అమలును సస్పెండ్ చేస్తూ తెలంగాణ  హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ, కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను కూడా లెక్క చేయలేదని చిత్ర యూనిట్‌పై విమర్శలు వస్తున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించరా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా  బుక్ మై షోతో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌ల‌లో పెంచిన ధ‌ర‌లే  క‌నిపిస్తున్నాయ‌ని కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంలో న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆపై ఓజీ సినిమాకు  ‘A’ సర్టిఫికేట్ జారీ చేయడంతో 18 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించకుండా చూడాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.. దానిని కూడా వారు పాటించకుండా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఓజీ ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800 పెంపుతో పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు  సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమ‌తినిచ్చింది. దీనిని సవాల్ హైదరాబాద్‌కు చెందిన బి.మల్లేశ్‌యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. 2021లో జారీచేసిన జీవో120కి విరుద్ధంగా ఓజీ సినిమా టికెట్‌ ధరలు ఉన్నాయన్నారు. దీంతో న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతూ పలు వ్యాఖ్యలు చేసింది. కొత్త సినిమాలకు బెనిఫిట్‌ షోలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రదర్శిస్తున్నారని సూటిగానే కోర్టు ప్రశ్నించింది. 

ఈ షోలతో వచ్చిన డబ్బుతో అనాథలకు ఏమైనా ఆసరాగా వినియోగిస్తున్నారా అంటూ చెప్పాలని కోరింది. కేవలం ఎగ్జిబిటర్లకు లాభాలు చేకూర్చడానికి ఇలా టికెట్‌ రేట్లు పెంచేందుకు  అనుమతిస్తారా అంటూ కడిగిపారేసింది. ఇందుకోసం ప్రభుత్వ నిబంధనలనే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అయినప్పటికీ టికెట్‌ ధరలను మాత్రమ తగ్గించలేదు. దీంతో న్యాయస్థానం అంటూ ఎలాంటి గౌరవం లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)