Breaking News

లవ్‌... ఎమోషన్‌

Published on Wed, 02/19/2025 - 01:15

‘‘దిల్‌ రూబా’ టీజర్, ట్రైలర్‌లో ఏ కంటెంట్‌ చూపించామో సినిమాలోనూ అదే ఉంటుంది. ఎక్కడా అనవసరపు కంటెంట్‌ ఉండదు. ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంటెన్స్ మ్యూజికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) చెప్పారు. విశ్వ కరుణ్‌ దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం ‘దిల్‌ రూబా’. రవి, జోజో జోస్, రాకేశ్‌ రెడ్డి, సారెగమ నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది.

సామ్‌ సీఎస్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘హే జింగిలి..’ అంటూ సాగే సెకండ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటని సామ్‌ సీఎస్‌ పాడారు. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘సారెగమ వాళ్లు ఫస్ట్‌ టైమ్‌ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి వస్తున్నారు. రవిగారు, విశ్వ కరుణ్‌ మూడేళ్లుగా ఈప్రాజెక్ట్‌ కోసం కష్టపడ్డారు. 

వాళ్ల కోసమైనా ‘దిల్‌ రూబా’  సక్సెస్‌ కావాలి’’ అన్నారు. ‘‘మా ‘దిల్‌ రూబా’ పాన్‌ ఇండియా మూవీ కాకపోయినా పాన్‌ ఇండియాప్రొడక్షన్‌ సారెగమతో కలిసి సినిమా చేశాం’’ అని రవి చెప్పారు. ‘‘హే జింగిలి... పాటకి మంచి పేరొస్తుంది’’ అన్నారు విశ్వ కరుణ్‌. ‘‘దిల్‌ రూబా’ ప్యూర్‌ లవ్‌ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంటుంది’’ అని రుక్సార్‌ థిల్లాన్‌ పేర్కొన్నారు. లిరిక్‌ రైటర్‌ భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్‌ ఈశ్వర్‌ పెంటి మాట్లాడారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)