Breaking News

ఈ హీరోయిన్ల చేతిలో ఒక్క సినిమా కూడా లేదు

Published on Sat, 10/21/2023 - 05:01

సినిమా తర్వాత సినిమా... ఒకేసారి రెండు లేక మూడు సినిమాలు చేసే హీరోయిన్లు హఠాత్తుగా కొత్త సినిమా సైన్‌ చేయకపోతే? ‘వాట్‌ నెక్ట్స్‌’ అనే ప్రశ్న ఎదురవుతుంది. ఆ నాయికలు ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ డైరీలో తెలుగు సినిమా లేకపోవడం ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచే విషయం. ప్రస్తుతం తెలుగులో  సినిమా సైన్‌ చేయని నాయికల గురించి తెలుసుకుందాం.

గ్యాప్‌ లేకుండా...
అటు కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా, ఇటు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో ఆకట్టుకున్న అనుష్క జోరు గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిందనే చెప్పాలి. ఏడాదికి ఐదారు తెలుగు సినిమాలు చేసిన ఆమె  ప్రస్తుతం ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటున్నారు. 2021, 2022లో అయితే అనుష్క కనీసం ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు.

ఈ ఏడాది నవీన్‌ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సెప్టెంబర్‌ 7న విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇక నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తానని, తెలుగులో గ్యాప్‌ లేకుండా ప్రాజెక్ట్స్‌ కమిట్‌ అవుతానని అన్నారు అనుష్క. ప్రస్తుతం ‘కథనార్‌– ది వైల్డ్‌ సోర్సెరర్‌’ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. అయితే తెలుగులో కొత్త సినిమా ఏదీ సైన్‌ చేయలేదు.

సంవత్సరం విరామం  
దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకెళుతున్న సమంత సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘మయోసైటిస్‌’ వ్యాధి బారిన పడిన ఆమె కొన్నాళ్ల పాటు షూటింగ్స్‌కి దూరంగా ఉంటూ చికిత్స తీసుకుని సినిమాలు చేశారు. ఇక సమంత ఫుల్‌ స్పీడ్‌తో సినిమాలు చేస్తారని ఆశించిన ఆమె అభిమానుల ఆనందం ఆవిరి అయ్యేట్లు ఏడాది పాటు తాను సినిమాలకు గ్యాప్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు సమంత.

మయోసైటిస్‌ పూర్తి స్థాయి చికిత్స కోసమే సమంత ఈ బ్రేక్‌ తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. కాగా విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబరు 1న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. ‘ఖుషి’ వంటి హిట్‌ మూవీ తర్వాత సమంత నటించనున్న తెలుగు సినిమా ఏంటి? అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇకపోతే హిందీలో సమంత లీడ్‌ రోల్‌లో నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్, ‘చెన్నయ్‌ స్టోరీస్‌’ (ఇంగ్లీష్‌–తమిళ్‌) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

రెండేళ్లు గ్యాప్‌  
సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. తెలుగులో వరుస చిత్రాలతో తన సత్తా చాటిన ఈ బ్యూటీ రెండేళ్లుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయకపోవడం విశేషం. క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘కొండపొలం’ చిత్రంలో నటించారు రకుల్‌. 2021 అక్టోబర్‌ 8న ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు రకుల్‌. బాలీవుడ్‌కి పరిమితమై వరుసగా హిందీ సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ‘ఐ లవ్‌ యు’, ‘మేరీ పత్నీ కా రీమేక్‌’ చిత్రాలతో పాటు తమిళంలో ‘ఆయ లాన్, ఇండియన్‌ 2’ చిత్రాలు చేస్తున్నారు. అయితే రెండేళ్లుగా కనీసం ఒక్క తెలుగు సినిమా కూడా చేయకపోవడంతో ఆమె ఫ్యాన్స్‌ నిరుత్సాహపడుతున్నారు. కనీసం వచ్చే ఏడాది అయినా ఈ బ్యూటీ తెలుగులో తన జోరు చూపిస్తారేమో చూడాలి.  

కొత్త సినిమా ఎప్పుడు?
తెలుగు పరిశ్రమలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు కృతీ శెట్టి. తొలి సినిమా ‘ఉప్పెన ’(2021) తో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచారీ బ్యూటీ. గత ఏడాది (2022) కృతీ శెట్టి నటించిన ‘బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలు రిలీజయ్యాయి. ఈ ఏడాది ఆమె నటించిన తెలుగు చిత్రం ‘కస్టడీ’ ఒక్కటే రిలీజ్‌ అయింది. ఆ చిత్రం విడుదలై ఆర్నెల్లు దాటినా మరో తెలుగు సినిమా సైన్‌ చేయలేదు కృతి. తెలుగులో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళంలో ‘అజయంతే రందం మోషణం’, తమిళంలో ‘జెనీ’ సినిమాలు చేస్తున్నారు. మరి.. కృతీ డైరీలో కొత్త తెలుగు సినిమా చేరేది ఎప్పుడు?

ఈ ఏడాది ‘దసరా, భోళా శంకర్‌’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు కీర్తీ సురేశ్‌. ఆ చిత్రాల తర్వాత మరో తెలుగు సినిమా అంగీకరించని కీర్తి తమిళంలో నాలుగు సినిమాలు చేçస్తున్నారు. ఆమె నటించనున్న తదుపరి తెలుగు సినిమా ఏంటి? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అదే విధంగా గత ఏడాది విడుదలైన ‘ఆచార్య’ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు పూజా హెగ్డే. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’లో హీరోయిన్‌గా ఎంపికైనా ఎందుకనో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారీ బ్యూటీ. అలాగే ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నభా నటేశ్‌ ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాలు చేశారు.

అయితే ‘మాస్ట్రో’ (2021) తర్వాత ఇప్పటివరకూ ఆమె మరో తెలుగు సినిమాపై ఎలాంటి సమాచారం లేదు. అదే విధంగా మెహరీన్, నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్‌ వంటి హీరోయిన్ల జోరు కూడా తెలుగులో తగ్గింది. మెహరీన్‌ ఈ ఏడాది ‘స్పార్క్‌’ (తెలుగు–తమిళ్‌) లో నటిస్తున్నారు. ఆ తర్వాత ఆమె నటించే తెలుగు సినిమాపై క్లారిటీ లేదు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజైన ‘రావణాసుర’ చిత్రం తర్వాత అనూ ఇమ్మాన్యుయేల్‌ ఏ తెలుగు సినిమాలోనూ నటించడం లేదు. అలాగే  నిధీ అగర్వాల్‌ చేతిలోనూ ‘హరిహర వీరమల్లు’ మినహా మరో తెలుగు సినిమా లేదు. ఈ సినిమా ఎప్పుడో ఒప్పుకున్నారామె. అయితే షూటింగ్‌ ఆలస్యం అవుతోంది. ఈ చిత్రం తర్వాత వేరే ఏ తెలుగు సినిమా కూడా ఆమె కమిట్‌ కాలేదు. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)