Breaking News

డైరెక్టర్‌ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్‌

Published on Mon, 01/13/2025 - 20:52

మన్మథుడు హీరోయిన్‌ అన్షు (Anshu)పై దర్శకుడు నక్కిన త్రినాధరావు (Trinadha Rao Nakkina) అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె శరీరాకృతి గురించి అభ్యంతరకరంగా మాట్లాడటంతో మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు దర్శకుడి తీరును ఎండగడుతున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న త్రినాధరావు హీరోయిన్‌ అన్షుతో పాటు మహిళందరికీ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే!

నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు
తాజాగా ఈ వివాదంపై అన్షు స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ముందుగా మజాకా సినిమా టీజర్‌ (Mazaka Movie)ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాకాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. త్రినాధరావు చేసిన వ్యాఖ్యల గురించి చాలా కథనాలు వస్తున్నాయి. 

నాకెన్నో సలహాలు, సూచనలిచ్చారు
మీ అందరికీ చెప్పాలనుకుంటున్నదేంటంటే.. ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను తన ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. తనపై నాకు చాలా గౌరవం ఉంది. మజాకా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్రినాధ్‌ సర్‌తో కలిసి పని చేసినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి నాకు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో! ఆయన నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తనపై నాకు ప్రేమ, గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయండి' అని కోరింది.

(చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్‌.. ఘనంగా సీమంతం)

రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీ
హీరోయిన్‌ అన్షు అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిలైపోయి సినిమాలకు దూరంగా ఉంటోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో అన్షు రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో అన్షుతో పాటు సందీప్‌ కిషన్‌, రీతూ వర్మ, రావు రమేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ అందించగా త్రినాధ రావు దర్శకత్వం వహించాడు.

టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అసభ్యకర వ్యాఖ్యలు
ఆదివారం (జనవరి 12న) మజాకా సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్‌ అన్షుపై నోరు జారాడు. మొదటగా ఆమెకు పెద్ద అభిమానిని అన్నట్లుగా ప్రసంగం మొదలుపెట్టిన ఈయన చివరకు వచ్చేసరికి మాత్రం ఆమె శరీరాకృతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అన్షు సన్నగా ఉందని.. ఇలా ఉంటే సరిపోదు.. లావెక్కాలి.. అంటూ అసహ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్‌ త్రినాధరావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఇక ఇదే ఈవెంట్‌లో హీరోయిన్‌ రీతూ వర్మ పేరు మర్చిపోయినట్లు నాటకం ఆడాడు త్రినాధరావు. దీనిపై కూడా నెట్టింట విమర్శలు వచ్చాయి. మజాకా సినిమా విషయానికి వస్తే ఇది వచ్చే నెల 21న విడుదల కానుంది.

చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్‌ ఆగ్రహం

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)