Breaking News

రాజకీయ ఎంట్రీకి బలంగా బాటలు వేసుకుంటున్న విజయ్‌!

Published on Sat, 09/16/2023 - 09:59

హీరో విజయ్‌ తన రాజకీయ రంగప్రవేశానికి బాటను బలంగా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన తర్వాత లక్ష్యాన్ని ఛేదించాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓ పక్క చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క తన విజయ్‌ మక్కళ్‌ ఇయక్కుమ్‌ ద్వారా సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు.

ఇటీవల రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలను కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు.

ఇకపోతే తాజాగా ఉచిత వైద్య క్లినిక్‌ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ మక్కళ్‌ ఇయక్కమ్‌ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ పేర్కొన్నారు. త్వరలోనే ఉచిత వైద్య క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

చదవండి: సైమా అవార్డ్స్‌- 2023.. ఎన్టీఆర్‌, శ్రీలీలదే హవా!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)