Breaking News

దళపతి కొత్త మూవీ.. టైటిల్‌ అదేనంటూ వైరల్!

Published on Fri, 12/22/2023 - 15:01

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. లియో తర్వాత వెంకట్‌ ప్రభు దర్శకత్వం ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన  విషయాలు బయటకొస్తున్నాయి. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

ఇందులో ఒక పాత్ర కోసం విజయ్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూత్‌ ఫుల్‌గా తయారవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా ఈ చిత్రానికి బాస్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు న్యూస్‌ తెగ వైరలవుతోంది. ఇకపోతే ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ డిసెంబరు 31వ తేదీన విడుదల చేయడానికి యూనిట్‌ వర్గాలు  రెడీ అయ్యాయి. దీనిపై గురించి చిత్ర ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అర్చన తెలుపుతూ తమ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏదీ నిజం లేదన్నారు.

ముఖ్యంగా చిత్ర టైటిల్‌ బాస్‌ అని జరుగుతున్న ప్రచారంలో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. ఈ చిత్రానికి సంబంధించి వెంకట్‌ ప్రభు స్పెషల్‌గా ఆలోచించారని.. ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. విజయ్‌ తన 69, 70వ చిత్రాలకు కూడా కమిట్‌ అయినట్లు తెలిసింది. తన 69వ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజ్‌, 70వ చిత్రానికి దర్శకుడు శంకర్‌ లేదా అట్లీ గానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు టాక్‌.  కాగా.. ఈ చిత్రంలో నటి స్నేహ, లైలా, రాఘవ లారెన్స్‌, ప్రశాంత్‌, మైక్‌ మోహన్‌, ప్రేమ్‌ జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)