Breaking News

నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి.. విజయ్ నివాళులు

Published on Wed, 05/06/2026 - 19:50

ప్రముఖ నిర్మాత అధినేత ఆర్‌బీ చౌదరి భౌతికకాయానికి హీరో, టీవీకే అధినేత విజయ్ నివాళులర్పించారు. చెన్నైలోని నిర్మాత నివాసానికి వెళ్లిన విజయ్‌ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‍అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ విజయ్‌ స్వయంగా వెళ్లి నివాళులర్పించడం విశేషం.

కాగా... ఆర్‌బీ చౌదరితో విజయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆర్‌బీ చౌదరి నిర్మాత వ్యహరించారు. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు.

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌బీ చౌదరి దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్‌తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు. కాగా.. గురువారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 

 

Videos

VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం

వర్మ ఏంటి ఈ కర్మ.. ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ..! KSR డీటెయిల్ అనాలసిస్

తమిళనాడు సీఎం విజయ్..?

కరీంనగర్‌లోని BRS క్యాంప్ కార్యాలయంపై BJP దాడి

మైనర్ అమ్మాయిలే టార్గెట్.. వెలుగులోకి ఇన్ స్టాగ్రామ్ చీటర్ అర్జున్ అరాచకాలు

సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై టీడీపీ గుండాల దాడి

చంద్రబాబు అండతో భారీ భూ కబ్జా... గీతంకు హైకోర్టు నోటీసులు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడి

పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయా..! ఆర్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)