Breaking News

స్టార్‌ హీరో ఇంటికి కోడలిగా సుమన్‌ కూతురు?

Published on Fri, 05/12/2023 - 08:46

నీచల్‌ కులమ్‌(తమిళ) సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన సుమన్‌ సుమారు 45 ఏళ్లుగా నటుడిగా సత్తా చాటుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర నటుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు. 90ల్లో అగ్ర హీరోగా రాణించిన సుమన్‌ యాక్షన్‌ సినిమాలతో పాటు భక్తి చిత్రాలతోనూ మెప్పించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో జైలు జీవితం గురించి, ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నా కూతురు గోల్డ్‌ మెడలిస్ట్‌
'నేను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికీ తెలుసు. ఆ కేసులో నా ప్రమేయం లేకపోయినా నన్ను లోపలేశారు. ఆ సమయంలో సుహాసిని, సుమలత నాకు సపోర్ట్‌గా మాట్లాడారు. సుమన్‌ ఇలాంటి చీప్‌ పనులు చేయడని స్టేట్‌మంట్‌ ఇచ్చారు. అది నాకు బాగా సాయపడింది. నా కూతురు అఖిలజ ప్రత్యూష విషయానికి వస్తే తనకు యాక్టింగ్‌ మీద ఆసక్తి లేదు. రెండేళ్ల క్రితం ఆమె మణిపాల్‌ యూనివర్సిటీలో హ్యూమన్‌ జెనిటిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సంపాదించింది. సౌత్‌ ఇండియాలోని స్టార్‌ హీరో ఇంటికి నా కూతురు కోడలిగా వెళ్తుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో దాని గురించి ఆలోచించలేదు. తన చదువు పూర్తయ్యాకే పెళ్లిపై దృష్టి పెడతాం' అన్నారు సుమన్‌.

జైలు జీవితం గడిపిన సుమన్‌
కాగా 1985లో సుమన్‌ జైలుపాలయ్యారు. సుమన్‌ స్నేహితుడు దివాకర్‌కు క్యాసెట్‌ రెంట్‌కు ఇచ్చే షాపు ఉంది. ఆయన దగ్గర సుమన్‌ అప్పుడప్పుడు సినిమా క్యాసెట్లు తీసుకునేవారు. దివాకర్‌ తన స్నేహితుడే కావడంతో ఓసారి కారు అడిగితే ఇచ్చారు సుమన్‌. దాన్ని దివాకర్‌ నీలి చిత్రంలో వాడాడట. దీంతో ఇందులో సుమన్‌ హస్తం కూడా ఉందని పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి జైలులో వేశారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఈ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ అప్పటికే హీరోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమన్‌ జైలు నుంచి బయటకు వచ్చాక రచయిత డీవీ నరసరాజు మనవరాలు శిరీషను పెళ్లాడారు.

చదవండి: ఆ క్రికెటర్‌ను ప్రేమించా, కానీ..: హీరోయిన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)