Breaking News

తెలుగులో భయంకరమైన హారర్‌ సినిమా అదే: హీరో శ్రీరామ్‌

Published on Wed, 12/13/2023 - 09:31

‘‘హారర్‌ సినిమాల విషయంలో నాకు ఓ భయం ఉంటుంది. పేరుకి హారర్‌ సినిమా అంటారు కానీ అందులో అనవసరమైన కామెడీ, రొమాన్స్, సాంగ్స్‌ను ఇరికిస్తుంటారు. హారర్‌ అంటే థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. సాయికిరణ్‌ దైదా ‘పిండం’ మూవీ కథ చెప్పినప్పుడు ప్రేక్షకులు ఉలిక్కి పడతారనిపించింది’’ అని హీరో శ్రీరామ్‌ అన్నారు. సాయికిరణ్‌ దైదా దర్శకత్వంలో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్‌ చెప్పిన విశేషాలు.

► నేను నటించిన తొలి తెలుగు చిత్రం ‘ఒకరికి ఒకరు’ రిలీజై 20 ఏళ్లయింది. ఇన్నేళ్లయినా అలాగే ఉన్నారు. ఆరోగ్య రహస్యం ఏంటి? అని అడుగుతుంటారు. ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటాను. బయటకు వెళ్లినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. ఉన్న దాంతో సంతృప్తి చెంది ఆనందంగా ఉంటాను.

► సాయి కిరణ్‌ దైదా తీసిన ‘స్మోక్‌’ అనే షార్ట్‌ ఫిలిం చూసి తన ప్రతిభపై నమ్మకం కలిగింది. చెప్పిన బడ్జెట్ ప్రకారం టైమ్‌కి ‘పిండం’ పూర్తి చేశారు. యశ్వంత్‌ ఈ కథను నమ్మి సినిమా నిర్మించారు. ఇది థియేటర్‌లో చూసి అనుభూతి చెందాల్సిన హారర్‌ సినిమా. 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది.

► నా దృష్టిలో ఇప్పటిదాకా తెలుగులో భయంకరమైన హారర్‌ సినిమా అంటే రామ్‌గోపాల్‌ వర్మగారు తీసిన ‘రాత్రి’. ఆ మూవీని చాలాసార్లు చూశాను. ‘పిండం’ అనేది కేవలం హారర్‌ సినిమా కాదు... ఇందులోని బలమైన కథ, భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు.

► నేను చేసిన ‘రెక్కీ’ వెబ్‌ సిరీస్‌ సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ఓటీటీ కోసం ‘నెట్‌ వర్క్, హరికథ’ అనే ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. నేను, జీవీ ప్రకాశ్‌ తమిళ్‌లో ‘బ్లాక్‌ మెయిల్‌’ అనే మూవీ చేస్తున్నాం. అలాగే ‘సంభవం’ చిత్రం చేస్తున్నా. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను.

చదవండి: హీరోలనే ఎక్కువ మోస్తున్నారు.. హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలి?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)