Breaking News

నయన్‌- విఘ్నేశ్‌లను కలిపిన స్టార్‌ హీరో ఎవరంటే?

Published on Sat, 04/06/2024 - 18:44

నయనతార- విఘ్నేశ్‌ శివన్‌.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే స్టార్‌ కపుల్‌. నయనతార హీరోయిన్‌గా నటించిన నానుమ్‌ రౌడీ దాన్‌ (2015) సినిమాకు విఘ్నేశ్‌ (విక్కీ) దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో నేను రౌడీ అనే టైటిల్‌ పేరిట రిలీజైంది. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 జూన్‌ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఉయిర్‌, ఉలగం అని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులయ్యారు.

ఇకపోతే వీరి మధ్య లవ్‌ పుట్టడానికి ఓ స్టార్‌ హీరో కారణమంటున్నాడు విక్కీ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్‌ రౌడీ ధాన్‌ కథ నయనతారకు చెప్పమని ధనుష్‌ సరే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. మొదట్లో ఈ స్క్రిప్ట్‌ నచ్చలేదన్న విజయ్‌ సేతుపతి నయన్‌ ఓకే చేసిందనగానే తను కూడా సంతకం చేశాడు. ఈ సినిమా వల్ల నయన్‌కు ఎక్కువ సమయం కేటాయించాను. తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ప్రేమకు ధనుషే కారణమయ్యాడు' అని చెప్పాడు. నానుమ్‌ రౌడీ ధాన్‌ మూవీకి ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించాడు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)