Breaking News

నన్ను కూడా డ్రగ్స్‌ తీసుకోమన్నారు: హీరో నిఖిల్‌

Published on Sat, 06/24/2023 - 19:28

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్‌ చేసి ఆయన ఫోన్‌ డేటాను సేకరించారు. అందులో అతడు ఓ హీరోయిన్‌తో పాటు అషూ రెడ్డి, సురేఖా వాణి, ఆమె కూతురితో కలిసి దిగిన ఫోటోలు, వారితో సంభాషణలు జరిపినట్లుగా వందలాది ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయి. వీరితో పాటు బడాబాబులు కూడా ఆయన జాబితాలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక శాఖ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన 'పరివర్తన' కార్యక్రమానికి నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది సిగరెట్‌ తాగమని ఆఫర్‌ చేశారు. మరికొందరైతే చాలాసార్లు డ్రగ్స్‌ తీసుకోమని అడిగారు. కానీ ఒక్కసారి దానికి అలవాటు పడితే జీవితంలో మంచి రోజులు అనేవే ఉండదు. జీవితం సర్వనాశనమవుతుంది. అలాంటివాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలి. 

ముఖ్యంగా విద్యార్థుల జీవితం ఎంతో అందమైనది. డ్రగ్స్‌ అంటే జీవితానికి చరమగీతం పాడటమే! అది దృష్టిలో పెట్టుకుని దానికి దూరంగా ఉండండి. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్‌ తీసుకోవద్దు. త్వరలోనే రాష్ట్రం మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా మారాలని కోరుకుంటున్నా' అన్నాడు నిఖిల్‌.

చదవండి: చైతూను మెచ్చుకోవాల్సిందే, సమంతలో ఆ క్వాలిటీ నచ్చుతుంది: శోభిత

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు