Breaking News

నేనలా అనలేదు, ఇమేజ్‌ దెబ్బ తీయొద్దు.. కార్తికేయ ట్వీట్‌ వైరల్‌

Published on Mon, 08/14/2023 - 13:11

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో భారీ స్థాయిలో హిట్‌ అందుకున్నాడు కార్తికేయ. కానీ తర్వాత చేసిన ఏ సినిమా కూడా ఆ రేంజ్‌లో విజయాన్ని సాధించలేకపోయింది. ఎలాగైనా సరే తిరిగి ఫామ్‌లోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నాడీ యంగ్‌ హీరో. ప్రస్తుతం ఇతడు బెదురులంక సినిమా చేస్తున్నాడు. ఇందులో డీజే టిల్లు ఫేమ్‌ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. క్లాక్స్‌ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్‌ కానుంది.

ఈ క్రమంలో కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో నాకు రొమాంటిక్‌ ఫేమ్‌ వచ్చింది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టికి కూడా రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. అయితే ఆ సినిమాల్లోని పాత్రలకు ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధం లేదు. కథలో రొమాంటిక్‌ సీన్‌ ఉంది. మా ఇద్దరికీ అప్పటికే ఓ ఇమేజ్‌ ఉంది, కాబట్టి మమ్మల్ని ఈ సినిమాకు తీసుకుని ఉండొచ్చు' అని చెప్పుకొచ్చాడు.

దీన్ని సోషల్‌ మీడియాలో కొందరు వక్రీకరిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇద్దరికీ రొమాంటిక్‌ ఇమేజ్‌ ఉంది కాబట్టే బెదురులంకలో రొమాంటిక్‌ సీన్స్‌ కావాలని పెట్టారంటూ కామెంట్లు చేశారు. దీనిపై కార్తికేయ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 'ఇంటర్వ్యూ మొత్తం చూసి మాట్లాడండి.. నేనసలు అలా అనలేదు. దయచేసి నటీనటుల ఇమేజ్‌ దెబ్బతినేలా, సినిమాపై ఎఫెక్ట్‌ పడేలా ఏది పడితే అది పోస్ట్‌ చేయకండి. థాంక్యూ' అంటూ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేశాడు.

చదవండి: భోళా ఎఫెక్ట్‌.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? బేబి డైరెక్టర్‌ క్లారిటీ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)