Breaking News

జపాన్‌కు సిద్ధమవుతున్న కార్తీ 

Published on Sun, 07/10/2022 - 13:45

హీరో కార్తీ జపాన్‌కు సిద్ధం అవుతున్నారట. ఇక్కడ జపాన్‌ అంటే దేశం అనుకునేరు. కానే కాదు. కార్తీ నటించే 24వ సినిమా పేరు. ప్రస్తుతం కార్తీ నటిస్తున్న సర్ధార్‌ చిత్రం వచ్చే దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. దీంతో తదుపరి చిత్రం ఏమిటన్నది కోలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

(చదవండి: ప్రియుడితో లాకప్‌ బ్యూటీ పెళ్లి, మేకప్‌ బెడిసికొట్టిందిగా!)

తాజాగా కార్తీ నూతన చిత్రం గురించి సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రచారం వైరల్‌ అవుతోంది. కూక్కూ జోకర్‌ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు రాజు మురుగన్‌ దర్శకత్వంలో కార్తీ నటించడానికి పచ్చజెండా ఊపారట. దీనిని డ్రీమ్‌ వారియర్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జపాన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్ర కథ కార్తీకి తగ్గట్టుగా, దర్శకుడు రాజు మురుగన్‌ బాణీలో ఉంటుందని తెలిసింది. సర్ధార్‌ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత కార్తీ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

#

Tags : 1

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)