Breaking News

ఉగాది కానుకగా.. కొత్త పాటల సందడి

Published on Thu, 03/23/2023 - 08:32

ఉగాది పండగని పురస్కరించుకుని పలు సినిమాల నుంచి పాటలు విడుదలయ్యాయి. ఆ పాటల సందడి విశేషాలు చూద్దాం..

⇔ రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచిన ఈ సినిమా నుంచి ‘డిక్కా డిష్యూం..’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి యూకే, భీమ్స్, నరేష్‌ మామిండ్ల ఆలపించారు. 

⇔ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తీ సురేష్‌ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సంతోష్‌ నారాయణన్‌ స్వరపరచిన ‘ధూం ధాం దోస్తాన్‌..’ అనే వీడియో సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటని రాహుల్‌ సిప్లిగంజ్, కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న, కాసర్ల శ్యామ్‌ పాడారు. 

⇔ అనుష్క శెట్టి, నవీన్‌ పోలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి. మహేష్‌ కుమార్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మించారు. ఈ సినిమా నుంచి ‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ..’ అనే తొలి లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. రధన్‌ సంగీతం అందించిన ఈ పాటను అనంత్‌ శ్రీరామ్‌ రాయగా, ఎమ్‌ఎమ్‌ మానసి పాడారు.  



⇔ రాఘవ లారెన్స్‌ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. కదిరేశన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత ‘ఠాగూర్‌’ మధు తెలుగులో ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘భగ భగ రగలరా..’ పాటని రిలీజ్‌ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని పృథ్వీ చంద్ర పాడారు. 

⇔ యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరారి’. గాలి ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మించిన ఈ సినిమా ఈ 30న రిలీజవుతోంది. ఈ చిత్రం కోసం మహిత్‌ నారాయణ్‌ స్వరాలు సమకూర్చి, రాసిన ‘ఏమో ఏమో..’ పాటని నటి విజయశాంతి రిలీజ్‌ చేశారు. ఈ పాటను సాయి చరణ్, సురభి శ్రావణి పాడారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)