Breaking News

వినేశ్‌ ఫొగట్‌పై హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Wed, 08/07/2024 - 18:57

సెమీ ఫైనల్‌లో విజయం.. ఫైనల్‌లో పతకం సాధించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో భారతీయ క్రీడాభిమానులకు ఊహించని షాక్‌.. భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు. 50 కిలోల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందంటూ ఒలంపిక్‌ సంఘం ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.

కష్టమంతా వృథా
పతకం ఖాయమనుకున్న అభిమానుల మనసు ముక్కలైంది. బరువు నియం​​త్రణ కోసం వినేశ్‌ ఎంతగానో కష్టపడింది. నీళ్లు తాగకుండా నిద్రను త్యాగం చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. ​విజయానికి అడుగు దూరంలో ఉన్న ఆమెను 100 గ్రాముల కోసం రేసులోనే లేకుండా చేయడమేంటని యావత్‌ భారత క్రీడాభిమానులు విచారం వ్యక్తం చేశారు.

ఇదొక గుణపాఠం
కానీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని మాత్రం ఈ అంశంపై విభిన్నంగా స్పందించారు. 100 గ్రాముల అధిక బరువు వల్ల అనర్హతకు గురవడం వింతగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు బరువు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఇది మనందరికీ ఓ గుణపాఠం. ఆమె త్వరగా 100 గ్రాముల బరువు తగ్గాలని ఆశిస్తున్నాను. అయినా ఇప్పుడు ఒలంపిక్‌ పతకమైతే రాదు కదా అని చివర్లో సెటైరికల్‌గా ఓ నవ్వు విసిరింది.

సంతోషం?
ఆమె రియాక్షన్‌ చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఒక క్రీడాకారిణి మీద అలాంటి కామెంట్లు చేయడమేంటి? పైగా చివర్లో ఆ నవ్వు చూశారా?', 'బరువు తగ్గడం గురించి లెక్చర్‌ ఇవ్వాల్సిన సమయమా ఇది', 'ఒక ఛాంపియన్‌ వైఫల్యాన్ని చూసి తను ఎలా నవ్వుతుందో చూశారా?', 'వినేశ్‌పై వేటు వేసినందుకు తెగ సంతోషిస్తున్నట్లు ఉంది'  అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు.

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)