Breaking News

'అంబానీ మామ.. నీకు వంద రీచార్జులు'.. నవీన్‌ పొలిశెట్టి కొత్త సినిమా టీజర్‌

Published on Thu, 12/26/2024 - 13:59

హీరోలు కూడా అలవోకగా కామెడీ పండించగలరు అని నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) నిరూపించాడు. తను నోరు విప్పితే చాలు ఏదో ఒక పంచ్‌ రావాల్సిందే.. ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే! నేడు (డిసెంబర్‌ 26న) నవీన్‌ పొలిశెట్టి బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా (Anaganaga Oka Raju Movie) నుంచి రాజుగారి ప్రీవెడ్డింగ్‌ వీడియో రిలీజ్‌ చేశారు.

ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే..
టీజర్‌ ప్రారంభంలో పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారు పళ్లెంలో భోజనం వడ్డిస్తున్నారు. మరోవైపు రాజుగారు నవీన్‌ పొలిశెట్టి.. ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ పెళ్లి వీడియో చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముకేశ్‌ అంబానీ ఫోన్‌ చేశాడట! ముకేశ్‌ మామయ్య... నీకు వంద రీచార్జులు.. ఇప్పుడే మన అనంత్‌ పెళ్లి క్యాసెట్‌ చూస్తున్నా.. అంటూ సంభాషణ మొదలుపెట్టాడు. తన ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యమంతే! జస్టిన్‌ బీబర్‌, కిమ్‌ కర్దాషియన్‌, జాన్‌ సేన.. అందరితో తన సంగీత్‌లో స్టెప్పులేయిస్తాడంటున్నాడు. చివర్లో పెళ్లికూతురు మీనాక్షి చౌదరితో ఫోటోషూట్‌ కూడా చేయించారు.

ప్రీవెడ్డింగ్‌ వీడియో అదిరింది!
ఈ ప్రీవెడ్డింగ్‌ వీడియో బ్లాక్‌బస్టర్‌ అవడం గ్యారెంటీ! మూడు నిమిషాల వీడియోలోనే ఇంత ఫన్‌ ఉంటే ఫుల్‌ సినిమా ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. ఇకపోతే... అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. తార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)