Breaking News

విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది: హర్షాలీ మల్హోత్రా

Published on Mon, 12/01/2025 - 00:05

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఈ చిత్రంలోని ప్రధానపాత్రల్లో నటించారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో హర్షాలీ మల్హోత్రా మాట్లాడుతూ–  ‘‘సల్మాన్‌ ఖాన్‌గారు నటించిన ‘బజరంగీ భాయిజాన్‌’ చిత్రంలో చైల్డ్‌ ఆర్టిస్టుగా చేశాను. పదేళ్ల తర్వాత ఇప్పుడు ‘అఖండ 2’ చిత్రంలో జననిపాత్ర చేశాను.

ఈ పదేళ్ల గ్యాప్‌లో చదువు మీద  ఫోకస్‌ పెట్టాను... కథక్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమా ఆఫర్స్‌ వచ్చాయి. కానీ ‘అఖండ 2’ సరైన అవకాశంగా భావించి, ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో నేను చేసిన జననిపాత్ర కథలో కీలకమైనది. జనని లైఫ్‌ ఎప్పుడు డేంజర్‌లో ఉంటే అప్పుడు తన కోసం అఖండ వస్తాడు. నాపాత్రకు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి.

సెట్స్‌లో బోయపాటిగారు నేను బాగా యాక్ట్‌ చేయడానికి ప్రోత్సహించారు. ‘బజరంగీ భాయిజాన్‌’ సినిమా అప్పుడు సల్మాన్‌గారితో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ ఆడాను. అలా ‘అఖండ 2’ సెట్స్‌లోనూ కొన్ని మెమొరబుల్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. అన్ని రకాల జానర్‌ సినిమాలు చేసి, విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేసేందుకు కూడా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు